MLC 2025: సిక్సర్ల వర్షం.. హై-వోల్టేజ్ టీ20 మ్యాచ్‌లో కాన్వే, సావేజ్‌ల దూకుడు!

MLC 2025:  సిక్సర్ల వర్షం.. హై-వోల్టేజ్ టీ20 మ్యాచ్‌లో కాన్వే, సావేజ్‌ల దూకుడు!
x
Highlights

MLC 2025: సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ లకు మంచి టైం నడుస్తున్నట్లుంది. ఒకవైపు టెస్ట్ క్రికెట్‌లో టెంబా బావుమా WTC ఫైనల్ గెలిచే అవకాశం ఉంది.

MLC 2025: సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ లకు మంచి టైం నడుస్తున్నట్లుంది. ఒకవైపు టెస్ట్ క్రికెట్‌లో టెంబా బావుమా WTC ఫైనల్ గెలిచే అవకాశం ఉంది. మరోవైపు, మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 లో దక్షిణాఫ్రికాలో పుట్టిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు తమ మొదటి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించారు. వాళ్లే డెవోన్ కాన్వే, కెల్విన్ సావేజ్. కాన్వే జోహన్నెస్‌బర్గ్‌లో పుట్టగా, కెల్విన్ డర్బన్‌లో జన్మించారు. అయితే, సౌతాఫ్రికాలో పుట్టిన ఈ ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ దక్షిణాఫ్రికా తరపున కాకుండా వేర్వేరు దేశాల తరపున ఆడుతున్నారు. ప్రస్తుతం, MLC 2025లో వారి అద్భుత ప్రదర్శనతో చర్చనీయాంశంగా మారారు.

టెక్సాస్ సూపర్ కింగ్స్ కు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కాన్వే ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, ఏడో స్థానంలో వచ్చిన కెల్విన్ సావేజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఇద్దరినీ మినహాయిస్తే, టెక్సాస్ జట్టులో మరే ఇతర ఆటగాడు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు, పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లు ఈ ఇద్దరే కావడం విశేషం.

డెవోన్ కాన్వే 150 స్ట్రైక్ రేట్‌తో ఆడి, 44 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్స్‌లు ఉన్నాయి. అతను కేవలం 2 ఫోర్లు మాత్రమే కొట్టాడు. కాన్వే తన జట్టులో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని తర్వాత కెల్విన్ సావేజ్ 4 సిక్స్‌లు బాదాడు. కెల్విన్ 155.88 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో కాన్వే, కెల్విన్‌ల మధ్య ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 79 పరుగుల పార్టనర్ షిప్ నమోదైంది. ఇది టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున మ్యాచ్‌లో అత్యధిక పార్టనర్ షిప్ కావడం విశేషం. ఈ భాగస్వామ్యం ఫలితంగానే టెక్సాస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది.

ఎక్కువ సిక్సులు కొట్టిందెవరు?

ఈ మ్యాచ్‌లో సిక్స్‌లు కొట్టడంలో కెల్విన్, కాన్వే కంటే వెనుకబడ్డాడు. అదే విధంగా, దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల MLC కెరీర్ కూడా ఉంది. వారిద్దరూ కలిసి తమ MLC కెరీర్‌లో మొత్తం 32 సిక్స్‌లు కొట్టారు. ఇందులో డెవోన్ కాన్వే 18 సిక్స్‌లు కొట్టగా, కెల్విన్ సావేజ్ 14 సిక్స్‌లు బాదాడు. వీరిద్దరి అద్భుతమైన ఆట క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories