మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడే క్రీడలు

మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడే క్రీడలు
x
Highlights

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం అన్నారు.

హైదరాబాద్: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం అన్నారు. రైల్వే స్టోర్స్‌ క్లబ్‌లోని ఇండోర్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు తెలంగాణ ఎక్సైజ్‌ అధికారుల సంఘం అధ్వర్యంలో ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందన ఎక్సైజ్‌ క్రీడాకారులకు డైరెక్టర్‌ ఆదివారం బహుమతులు ప్రధానం చేశారు. ఎక్సైజ్‌ ఉద్యోగంలో భాగంగా ఉండే పని ఒత్తిడి నుంచి ఉద్యోగులు ఉపసమనం పొందాలంటే క్రీడలు తమ జీవితంలో ఒక భాగంగా ఉండాలని షాన్‌వాజ్‌ ఖాసీం అన్నారు.

ఎక్సైజ్‌ క్రీడలను ప్రొహిబిహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ శనివారం ప్రారంభించారు. చెస్‌, బాల్‌ బాట్‌మెంటిన్‌ టెబుల్‌ టెన్నీస్‌, క్యారం క్రీడలను నిర్వహించారు. ఎక్సైజ్‌ ఉద్యోగులకు ఇండోర్‌ గ్రేమ్‌తోపాటు అవుట్‌ డోర్‌ గ్రేమ్‌లు వాలీబాల్‌, పుట్‌బాల్‌ తోపాటు ఇతర క్రీడల పోటీలు పెట్టాలని డైరెక్టర్‌ సూచించారు.

చెస్‌ పోటీల్లో గెలుపొందిన శశిధర్‌రెడ్డి, జుల్‌ ఫికర్‌ ఆహ్మద్‌, చంద్రశేఖర్‌లకు, బాల్‌ బ్యాట్‌మెంటిన్‌ పోటీల్లో జ్యోతి కిరణ్‌, శ్రీనివాసరెడ్డి, జీవన్‌ కిరణ్‌, చాణక్యలకు, ఉమెన్‌ విభాగంలో సౌజన్యశ్రీ, నీలోఫర్‌ అజ్మీ, నివేదిత, సౌమ్యశ్రీ, సుచిత్రలకు, టెబుల్‌ టెన్నీస్‌లో విజయ కుమార్‌, సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, డబుల్‌లో నవీన్‌ చంద్ర,ఖరేషి, సాయిరాం, హర్ష, క్యారమ్స్‌లో జుల్‌ఫికర్‌ ఆహ్మమద్‌, పవన్‌రెడ్డి, సాయిరాంలకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ క్రీడలను తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ గెజిటెడ్‌ అఫిసర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు జె.హరికిషన్‌, అర్గనైజింగ్‌ కార్యదర్శి జివన్‌ కిరణ్‌లు నిర్వహిణలో జరిగాయి.

బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో అడిషనర్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌, రంగారెడ్డి, వరంగల్‌, నల్లగొండ, మెదక్‌, ఖమ్మం, నిజామాబాద్‌, హైదరాబాద్‌, అదిలాబాద్‌, మహబుబాబాద్‌, డిప్యూటి కమిషనర్లు పి.దశరథ్‌, అంజన్‌రావు, శ్రీనివాసరెడ్డి, జె.హరికిషన్‌, జనార్థన్‌రెడ్డి , సోమిరెడి, అనిల్‌కుమార్‌ రెడ్డి, రఘురాం, విజయ భాస్కర్ రెడ్డి ఎక్సైజ్‌ అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి లతోపాటు ఎస్టీఎఫ్‌ టీం లీడర్లు, వివిధ జిల్లా ఏసీ, ఈఎస్‌లు, సీఐలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories