SRH: మా పని ఇంకా అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. ఇక కాస్కోండి!

SRH Coach Daniel Vettori Backs Aggressive Cricket
x

SRH: మా పని ఇంకా అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. ఇక కాస్కోండి!

Highlights

SRH కోచ్ వెటోరి, రెండు ఓటముల తర్వాత కూడా అటాకింగ్ ఆటపై నమ్మకంతో ఉన్నారు. ఆటతీరు మార్చకుండా నిలకడగా ఆడాలని స్పష్టం చేశారు.

SRH: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభాన్ని అద్భుత విజయంతో మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆ తర్వాత రెండు పరాజయాలను ఎదుర్కొంది. రాజస్తాన్ రాయల్స్‌పై ఏకంగా 286 పరుగులు చేసిన SRH, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పటికీ, అనంతర మ్యాచుల్లో అదే ధోరణిలో రాణించలేకపోయింది. అయినా, జట్టుకు ముఖ్యంగా బ్యాటింగ్‌ను దూకుడుగా కొనసాగించడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని హెడ్ కోచ్ డేనియల్ వెటోరి స్పష్టం చేశాడు.

తాజా పరాజయాలపై స్పందించిన వెటోరి, ఆటగాళ్లు తమ అటాకింగ్ స్టైల్‌ను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నాడు. టాప్-ఆర్డర్‌ ఆటగాళ్లు అటాకింగ్ స్టైల్‌తోనే విజయాలు సాధించారని, ఒక్కోసారి తప్పిపోయిన డెలివరీలు ఆ రోజే సిక్సర్లవుతాయని అన్నాడు. 'వేగంగా ఆడాలనే మా ఆలోచనలో మార్పు లేదు. అటు అభిషేక్ కొద్దిగా అసౌకర్యానికి గురయ్యాడు. ట్రావిస్, ఇషాన్ కూడా ఆ బంతులను సిక్సర్లుగా మలిచేవాళ్లే. కానీ ఈ తరహా ఆటలో ఒక్కోసారి వైఫల్యాలు సహజమే' అని చెప్పారు.

ఇప్పటివరకు రెండు పరాజయాలు ఎదురైనా, సీజన్ ప్రారంభ దశలో ఇలాంటివి జరిగేవే అని వెట్టోరి చెప్పాడు. ఆటగాళ్లు తమ కంబినేషన్లను అర్థం చేసుకుంటున్న సమయంలో చిన్నచిన్న పరాజయాలు సహజమని అభిప్రాయపడ్డాడు. ఒక పెద్ద వేలానికి తర్వాత వచ్చే మొదటి ఏడాది కావడంతో జట్లు ఇంకా సమన్వయాన్ని సాధించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. తన మాటలలో, 'ఒక విజయం మేము సాధించలేనిది కాదు. ప్రదర్శన చేయడమే మాకు ప్రధాన అవసరం. మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన తర్వా మేము అదే స్టైల్‌ను కొనసాగించాలని భావిస్తున్నాం. కానీ దాన్ని స్థిరంగా చేయగలమా? అనేది మాకు మిగిలిన సవాల్' అని అతను తేల్చి చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories