Sri Lanka vs India: శ్రీలంకతో మ్యాచ్ లు...సమయాల్లో మార్పులు

Sri Lanka vs India: త్వరలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్ మ్యాచ్ ల సమయాల్లో మార్పులు

Kranthi
Updated on: 13 July 2021 7:35 AM IST
Sri Lanka Announced New Timings for India vs Srilanka Limited Over Series
X

భారత్‌, శ్రీలంక కెప్టెన్లు:(ఫైల్  ఇమేజ్)

Sri Lanka vs India: త్వరలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్ మ్యాచ్ ల సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే డే అండ్ నైట్ వన్డేలను మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించాల్సి వుండగా...అరగంట వెనక్కి జరిపి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 25 నుంచి ప్రారంభమయ్యే టీ20ల ప్రారంభ సమయాన్ని రాత్రి 7 గంటల నుంచి 8 గంటలకు మార్చినట్లు ఎస్‌ఎల్‌సీ తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను ట్విటర్‌ వేదికగా ఎస్‌ఎల్‌సీ అభిమానులతో పంచుకుంది.

ఇటీవల ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశం చేరుకున్న శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బంది (బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు.. 18కి వాయిదా పడ్డాయి. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎల్‌సీ అధికారులు ప్రకటించారు

లంక టీమ్‌లో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మళ్లీ భారత క్రికెటర్లని క్వారంటైన్‌లో ఉండమని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశించింది. శనివారం నుంచి ధావన్ సేన హోటెల్లోనే క్వారంటైన్‌ అయింది. లంక బోర్డు నుంచి తదుపరి ఆదేశాల వరకూ భారత ఆటగాళ్లు హోటల్ రూములకే పరిమితం కానున్నారు. వన్డే, టీ20 సిరీస్ లలోని అన్ని మ్యాచ్ లు కొలంబో వేదికగా జరగనున్నాయి. టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న టీమిండియా జట్టులో అందరూ యువ ప్లేయర్లు కావడం విశేషం.


Kranthi

Kranthi

Next Story