
Suryakumar Yadav: అభిషేక్ లేదా తిలక్, ఎవరిని తప్పించాలి.. సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు!
Suryakumar Yadav: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టు కూర్పుపై చర్చ జరుగుతున్న వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Suryakumar Yadav: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టు కూర్పుపై చర్చ జరుగుతున్న వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సూపర్-8 మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ ఆడతాడా? అనే ప్రశ్నకు స్పందించిన సూరీడు.. జట్టు విజయవంతంగా ముందుకు సాగుతున్నప్పుడు మార్పులు ఎందుకు చేయాలని ప్రశ్నించాడు. సూపర్-8 దశ ఇప్పటికే ఆరంభం అయింది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మ్యాచ్ గురించి మాట్లాడాడు.
ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మను తప్పించి ఏదైనా మార్పు (సంజూ శాంసన్) చేయాలని అనుకుంటున్నారా? అని ఓ రిపోర్టర్ అడగగా.. 'టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ విజయాలు సాధించింది. జట్టు గెలుస్తున్న సమయంలో కాంబినేషన్‌ను మార్చడం సరైంది కాదు. టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ.. అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాము' అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. సంజూ శాంసన్‌కు అవకాశమిస్తారా? అనే చర్చ అభిమానుల్లో కొనసాగుతున్నప్పటికీ.. జట్టు సమతుల్యత, ప్రస్తుత ప్లేయింగ్ కాంబినేషన్‌పై మేనేజ్మెంట్ సంతృప్తిగా ఉన్నట్లు సూర్య వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. జట్టు విజయం కొనసాగుతున్నంత వరకు తుది జట్టులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని కెప్టెన్ సూర్య సంకేతాలు ఇచ్చాడు. సూర్య మాటలు బట్టి చూస్తే సంజూ సూపర్-8లో ఆడే అవకాశాలు లేనట్టే.
టీ20 ప్రపంచ కప్ 2026లో పరుగుల ఖాతా తెరవని అభిషేక్ శర్మ ఫామ్‌పై సూర్యకుమార్ స్పందించాడు. 'అభిషేక్ శర్మ ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. మీకో విషయం చెప్పాలి.. అతడి ఫామ్ గురించి ఆందోళనపడే వారి గురించే నేను ఆందోళన. చెందుతున్నా. ఏ బ్యాటర్‌కైనా ఇలాంటి గడ్డు పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అభిషేక్ ఆ దశలో ఉన్నాడు. గత ఏడాది అద్భుతంగా ఆడి భారత జట్టుకు మంచి విజయాలు అందించాడు. ఇప్పుడు మేం అతడికి మద్దతు ఇవ్వాలి. అభిషేక్ ఒక్కసారి కుదురుకుంటే.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతాడని అందరికి తెలుసు. తనదైన శైలిలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. అది వర్కౌట్ అయితే అభిషేక్‌ను ఆపడం చాలా కష్టం. అభిషేక్ ఇప్పటి వరకు రన్స్ చేయలేదు. ఒక్కసారి కుదురుకుంటే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు' అని సూర్య చెప్పుకొచ్చాడు. చూడాలి మరి కెప్టెన్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెడుతాడో లేదో.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




