
Suryakumar Yadav: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు.. ధోనీ, రో-కోలకు కూడా సాధ్యం కాలేదు!
Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడటం అంటేనే భారీ ఒత్తిడి ఉంటుంది.
Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడటం అంటేనే భారీ ఒత్తిడి ఉంటుంది. జట్టు బాధ్యతలతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొందరు కెప్టెన్లు తమ తొలి ఇన్నింగ్స్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి.. చరిత్ర సృష్టించారు. తాజాగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అసాధారణ ప్రదర్శనతో.. ఎలైట్ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు. టీమిండియా దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కానీ.. ఆ రేర్ రికార్డు ఏంటో చూద్దాం.
టీ20 ప్రపంచకప్ 2026లో అమెరికాతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు బాధ్యత తీసుకుని బ్యాట్‌తో ఆదుకున్న సూర్య ఇన్నింగ్స్ టీమిండియా అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ స్కోర్‌తో సూర్యకుమార్ కెప్టెన్‌గా డెబ్యూ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఉన్నాడు. 2009 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ది ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో గేల్ 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో సూరీడు ఉండడం భారత క్రికెట్‌కు గర్వకారణంగా మారింది.
మూడో స్థానంలో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ ఉన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యాపై జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అష్రాఫుల్ ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై జొహన్నెస్‌బర్గ్‌లో 61 పరుగులు చేసి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ స్కోర్లు సాధించిన ఈ ఆటగాళ్లు తమ నాయకత్వంతో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




