Suryakumar Yadav: సూర్యకుమార్ సంచలన నిర్ణయం?.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం..!

Suryakumar Yadav
x

Suryakumar Yadav: సూర్యకుమార్ సంచలన నిర్ణయం?.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం..!

Highlights

Suryakumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం సూర్య రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందనే ఊహాగానాలు నెట్టింట వినిపిస్తున్నాయి.

Suryakumar Yadav: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం సూర్య రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందనే ఊహాగానాలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఐసీసీ టోర్నీలలో సూరీడు పెద్దగా రాణించడం లేదు. అడపాదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే.. చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్ అయితే లేదు. భారత్ కప్ గెలిస్తే రిటైర్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడని నెటిజెన్స్ అంటున్నారు. అయితే దీనిపై అటు సూర్యకుమార్, ఇటు జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో ఇప్పటికే మూడు ఐసీసీ ఫైనల్స్‌లో ఆడాడు. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ ఆడిన సూర్య.. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడనున్నాడు. ఈ మ్యాచ్ అతడి కెరీర్‌లో కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ కూడా. ఈ నేపథ్యంలో ఫైనల్ తర్వాత అతను భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాడా అనే అంశం చర్చకు దారితీసింది. గత ఐసీసీ టోర్నమెంట్లలో సూర్యకుమార్ ప్రదర్శనపై కూడా విమర్శలు వచ్చాయి. కొన్ని కీలక మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదని విమర్శకులు అంటున్నారు. ముఖ్యంగా బిగ్ మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్ ప్రభావం పెద్దగా లేదని సోషల్ మీడియాలో పలువురు అభిమానులు చర్చిస్తున్నారు.

అయితే మరోవైపు సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతని ప్రత్యేకమైన 360 డిగ్రీల షాట్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కష్టమైన పరిస్థితుల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా కూడా గుర్తింపు పొందాడు. కెప్టెన్‌గా కూడా టీమిండియాను పలు కీలక విజయాల దిశగా నడిపించాడు. టీమిండియాలో ఉన్న బలమైన ఆటగాళ్ల సమన్వయం, జట్టు లోతు కూడా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే కొందరు అతని నాయకత్వాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది. ఫైనల్‌లో అతని ప్రదర్శన కూడా ఈ చర్చపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories