
T20 World Cup 1st Semi Finals Result
T20 World Cup 1st Semi Finals Result: కీలక మ్యాచుల్లో చేతులెత్తేసి దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరోమారు అదేపని చేశారు. వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఓటమి పాలయ్యారు
T20 World Cup 1st Semi Finals Result: దక్షిణాఫ్రికా మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుంది. కీలకమైన మ్యాచ్ లలో ఓడిపోయే తన అలవాటును మళ్ళీ నిలబెట్టుకుంది. అజేయంగా టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడి సెమీస్ కు చేరిన దక్షిణాఫ్రికా.. మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కనీస పోరాటం చేయకుండానే కివీస్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ మ్యాచ్ మొత్తం తన ఆధిపత్యాన్ని చాటింది. రెండో ఓవర్లోనే రెండు దక్షిణాఫ్రికా కీలక వికెట్లు పడగొట్టిన కివీస్.. తరువాత కూడా పట్టు వదల్లేదు. ఒక దశలో 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా కనీసం 125 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం వచ్చింది. అయితే, ఆరోవికెట్ కు ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు.. వేగంగా పరుగులు చేయడంతో 169 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ కు 170 పరుగుల టార్గెట్ ఇచ్చినట్లయింది. ఇది పోరాడగలిగే స్కోరే. అయినప్పటికీ, దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.
T20 World Cup 1st Semi Finals Result: 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతూ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 84 పరుగులు చేసిన న్యూజిలాండ్.. చివరి వరకూ అదే రీతిలో ఆడింది. 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఫిన్ అలెన్ 13వ ఓవర్లో మార్కో యాన్సన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు బౌండరీలు బాది తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫిన్ అలెన్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఫిన్ అలెన్ 33 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు, వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. 2016లో ఇంగ్లాండ్‌పై గేల్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఈ విజయంతో న్యూజిలాండ్ రెండోసారి T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. 2021లో తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




