India Squad: ఇదే అసలైన విధ్వంసక టీ20 జట్టు.. ప్రతి స్థానంలో మ్యాచ్ విన్నర్!

India Squad: ఇదే అసలైన విధ్వంసక టీ20 జట్టు.. ప్రతి స్థానంలో మ్యాచ్ విన్నర్!
x

India Squad: ఇదే అసలైన విధ్వంసక టీ20 జట్టు.. ప్రతి స్థానంలో మ్యాచ్ విన్నర్!

Highlights

T20 World Cup 2026: భారత టీ20 జట్టు ప్రస్తుతం అద్భుతమైన బ్యాటిం‌‌‌‌‌గ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ ఓ మ్యాచ్ విన్నర్.

T20 World Cup 2026: భారత టీ20 జట్టు ప్రస్తుతం అద్భుతమైన బ్యాటిం‌‌‌‌‌గ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ ఓ మ్యాచ్ విన్నర్. తనదైన రోజున ఒంటిచేత్తో ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాగేసే ప్లేయర్స్ అందరూ. ఓ ఆటగాడు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకునే విధంగా జట్టు నిర్మాణం ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్య.. ఇలా అందరూ జట్టును ఆడుకునేవారే. అందుకే ఈ టీమ్‌ను అభిమానులు ‘ది మోస్ట్ టీ20 సైడ్ ఎవర్’ అని అభివర్ణిస్తున్నారు.

టాప్ ఆర్డర్‌లో సంజూ శాంసన్ ఉన్నాడు. అతడు ఫామ్‌లో ఉంటే మ్యాచ్ ఫలితం ఆరంభంలోనే భారత్ వైపు తిరుగుతుంది. ఒకవేళ సంజూ విఫలమైతే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రంగంలోకి దిగుతాడు. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్.. క్షణాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాడు. అభిషేక్ కూడా ఆడలేకపోతే.. ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఎడమచేతి బ్యాటర్‌గా వేగంగా పరుగులు సాధించే నైపుణ్యం ఇషాన్‌ ప్రధాన బలం. ముఖ్యంగా స్పిన్నర్లపై దాడి చేస్తూ మ్యాచ్ దిశను మార్చగలడు. ఈ ముగ్గురిలో ఒక్కరు హిట్ అయినా భారత్ స్కోర్ చేయగలదు.

బ్యాటింగ్ విభాగంలో భారత జట్టుకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య.. క్రీజ్‌లోకి వస్తే బౌలర్లకు చుక్కలే. అతడి వినూత్న షాట్లు, హిట్టింగ్ మ్యాచ్‌ను క్షణాల్లో భారత్ వైపు తిప్పేస్తాయి. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ఆడే నైపుణ్యం తిలక్‌ ప్రత్యేకత. ఆపై వచ్చే శివమ్ దూబే భారీ షాట్లతో స్కోర్‌ బోర్డును వేగంగా పరుగులు పెట్టించే సత్తా కలిగిన ఆటగాడు. స్పిన్ అయినా, పేస్ అయినా.. స్టాండ్స్‌కు బంతిని పంపడంలో దూబే ప్రత్యేకత. హార్దిక్ పాండ్యా జట్టును ఎప్పుడూ ముందుకు నడిపిస్తాడన్న విషయం తెలిసిందే. బ్యాట్‌తో ఫినిషర్‌గా మ్యాచ్‌ను ముగించే ఆటగాడు హార్దిక్.

భారత జట్టుకు చివరి ఆశగా నిలిచేది ‘లార్డ్ రింకూ సింగ్’. అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన ఎన్నో మ్యాచ్‌లతో రింకూ ఇప్పటికే తన సత్తా నిరూపించాడు. చివరి ఓవర్లలో అతడి ప్రశాంతత, పవర్ హిట్టింగ్ భారత జట్టుకు అజేయ ఆయుధంగా మారాయి. మొత్తంగా చూస్తే.. ప్రస్తుత భారత టీ20 జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. బ్యాటింగ్ డెప్త్, హిట్టింగ్, ఒత్తిడిలోనూ ఆడగలిగే సామర్థ్యం.. ఇవన్నీ టీమిండియాను చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన టీ20 టీమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు ఈ జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ 2026 టీమిండియా సాదిస్తుందని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories