T20 World Cup 2026 : ఆఫ్ఘనిస్తాన్‎కు కోలుకోలేని దెబ్బ..వరల్డ్ కప్‎కు ముందే స్టార్ బౌలర్ వికెట్ డౌన్

T20 World Cup 2026 : ఆఫ్ఘనిస్తాన్‎కు కోలుకోలేని దెబ్బ..వరల్డ్ కప్‎కు ముందే స్టార్ బౌలర్ వికెట్ డౌన్
x

T20 World Cup 2026 : ఆఫ్ఘనిస్తాన్‎కు కోలుకోలేని దెబ్బ..వరల్డ్ కప్‎కు ముందే స్టార్ బౌలర్ వికెట్ డౌన్

Highlights

T20 World Cup 2026 : ఆఫ్ఘనిస్తాన్ స్పీడ్‌స్టర్ నవీన్ ఉల్ హక్ మరోసారి గాయం బారిన పడ్డాడు.

T20 World Cup 2026 : ఆఫ్ఘనిస్తాన్ స్పీడ్‌స్టర్ నవీన్ ఉల్ హక్ మరోసారి గాయం బారిన పడ్డాడు. దీంతో అతను వచ్చే వారం వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి కూడా తప్పుకున్నాడు. గత కొంతకాలంగా భుజం గాయంతో బాధపడుతున్న నవీన్, ఈ నెల చివర్లో శస్త్రచికిత్ చేయించుకోనున్నాడు. దీంతో అతను కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. నవీన్ చివరిసారిగా డిసెంబర్ 2024లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.. ఆ తర్వాత ఆసియా కప్ 2025కు కూడా గాయం కారణంగా దూరమయ్యాడు.

నవీన్ ఉల్ హక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో జరిగిన గొడవే. మైదానంలో వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో ఇద్దరూ కౌగిలించుకుని గొడవకు ముగింపు పలికారు. ఆఫ్ఘన్ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న నవీన్ లేకపోవడం ఆ జట్టు బౌలింగ్ విభాగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

నవీన్ ఉల్ హక్ స్థానంలో మెయిన్ టీమ్‌లోకి రావడానికి ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. మిస్టరీ స్పిన్నర్ గజన్ఫర్, బ్యాటర్ ఇజాజ్ అహ్మద్‌జాయ్ లేదా ఫాస్ట్ బౌలర్ జియా ఉర్ రెహమాన్ షరీఫీలలో ఒకరికి అదృష్టం వరించే అవకాశం ఉంది. గ్రూప్-డిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు కూడా ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ జట్టు: రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, మొహమ్మద్ ఇషాక్, సెడికుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories