T20 World Cup 2026: ప్రపంచకప్ చరిత్రలో చిరస్మరణీయ శతకాలు.. 'ఒకే ఒక్కడు' మిస్టర్ ఐపీఎల్!

T20 World Cup 2026: ప్రపంచకప్ చరిత్రలో చిరస్మరణీయ శతకాలు.. ఒకే ఒక్కడు మిస్టర్ ఐపీఎల్!
x

T20 World Cup 2026: ప్రపంచకప్ చరిత్రలో చిరస్మరణీయ శతకాలు.. 'ఒకే ఒక్కడు' మిస్టర్ ఐపీఎల్!

Highlights

T20 World Cup 2026: క్రికెట్‌లో శతకం చేయడం అంత ఈజీ కాదు. వరల్డ్‌కప్‌లో సెంచరీ బాదడం, అందులోనూ టీ20 వరల్డ్‌కప్‌లో హండ్రెడ్ సాధించడం చాలా అరుదైన ఘనత.

T20 World Cup 2026: క్రికెట్‌లో శతకం చేయడం అంత ఈజీ కాదు. వరల్డ్‌కప్‌లో సెంచరీ బాదడం, అందులోనూ టీ20 వరల్డ్‌కప్‌లో హండ్రెడ్ సాధించడం చాలా అరుదైన ఘనత. పొట్టి ఫార్మాట్‌లో 100 పరుగులు చేయడం అంటే అసాధారణ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించాల్సిందే. ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లలో కొద్ది మంది మాత్రమే ఈ ఘనతను సాధించి.. క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచారు. ఆ జాబితాలో మన ఇండియన్ ప్లేయర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఉన్నాడు.

2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ శతకం బాదాడు. దక్షిణాఫ్రికాపై జోహానెస్‌బర్గ్‌లో గేల్ సెంచరీ చేశాడు. 2010లో సురేష్ రైనా దక్షిణాఫ్రికాపై గ్రోస్ ఐలెట్ వేదికగా సెంచరీ చేసి భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. అదే ఏడాది శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే జింబాబ్వేపై ప్రొవిడెన్స్‌లో సెంచరీ కొట్టాడు. 2012లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ బంగ్లాదేశ్‌పై పల్లెకెలె మైదానంలో విధ్వంసం సృష్టించాడు. 2014 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్ శ్రీలంకపై చట్టోగ్రామ్‌లో శతకం నమోదు చేయగా.. అదే ఏడాది పాకిస్థాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ బంగ్లాదేశ్‌పై మీర్పూర్‌లో సెంచరీ సాధించాడు.

2016 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్టార్ తమీమ్ ఇక్బాల్ ఒమన్‌పై ధర్మశాలలో శతకం బాదాడు. అదే టోర్నీలో క్రిస్ గేల్ మరోసారి ఇంగ్లాండ్‌పై ముంబై వాంఖడే స్టేడియంలో సెంచరీ చేశాడు. 2021లో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ శ్రీలంకపై షార్జాలో శతకం సాధించాడు. 2022లో దక్షిణాఫ్రికా ఆటగాడు రైలీ రోసౌ బంగ్లాదేశ్‌పై సిడ్నీలో సెంచరీ చేయగా.. అదే ఏడాది న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ శ్రీలంకపై సిడ్నీలో శతకం బాదాడు. ఈ సెంచరీలు టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాయి. పొట్టి ఫార్మాట్‌లో శతకం సాధించిన ప్రతీ ఇన్నింగ్స్ అభిమానులకు చిరస్మరణీయంగా మారింది.

ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఆరంభం కానుంది. భారత్, శ్రీలంకలు వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఈసారి ఏకంగా 20 టీమ్స్ కప్ కోసం తలపడనున్నాయి. 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న అమెరికాతో టీమిండియా తలపడనుంది. భారత్ సునాయాసంగా సెమీస్ చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉండడమే ఇందుకు కారణం. దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే లాంటి ప్లేయర్స్ కూడా ధాటిగా ఆడుతారన్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories