New Zealand vs Canada: సమ్రా సెంచరీ వృథా.. న్యూజిలాండ్ గర్జన.. కెనడాపై 8 వికెట్ల విజయం

New Zealand vs Canada: టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ జట్టు తన సత్తా చాటింది.
New Zealand vs Canada: టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ జట్టు తన సత్తా చాటింది. మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో కెనడాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సూపర్-8 బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా తర్వాత సూపర్-8కు చేరిన రెండో జట్టుగా కివీస్ నిలిచింది.
సమ్రా సెంచరీ వృథా:
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా జట్టుకు ఓపెనర్ యువరాజ్ సమ్రా కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చాడు. కేవలం 65 బంతుల్లోనే 110 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడికి తోడుగా కెప్టెన్ బాజ్వా (36) రాణించడంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోరు సాధించింది.
రచిన్, ఫిలిప్స్ సునామీ:
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 30 పరుగులకే ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (6), ఫిన్ అలెన్ (21) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఈ దశలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (76), రచిన్ రవీంద్ర (59) కెనడా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 146 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించడంతో న్యూజిలాండ్ కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
సూపర్-8 సమీకరణాలు:
న్యూజిలాండ్ విజయంతో గ్రూప్-డి నుంచి ఆఫ్ఘనిస్థాన్, యూఏఈ, కెనడా జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇప్పటివరకు టీమిండియా, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లు సూపర్-8లో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు గ్రూప్-ఏలో పాకిస్థాన్, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా జట్ల భవితవ్యం ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉండటంతో టోర్నీలో ఉత్కంఠ నెలకొంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



