
T20 World Cup 2026: భారత జట్టులో విభేదాలు.. కోచ్ గంభీర్‌పై తీవ్ర ఆరోపణలు!
సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న వేళ భారత క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్న వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.
సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న వేళ భారత క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్న వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మధ్య ఇంకా సఖ్యత కుదరలేదని తెలుస్తోంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగి ఓ రోజు గడిచినా.. ఇద్దరు ఎడమొహం పేడ మెహంగా ఉన్నారట. పాక్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనలపై కుల్దీప్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. కుల్దీప్, సూర్య మధ్య విభేదాలు ఇంకా తొలగిపోలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
భారత జట్టు వాతావరణం కూడా ప్రస్తుతం ఏమంత బాగా లేదని సమాచారం. ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలినే కొందరు పేర్కొంటున్నారు. హెడ్ కోచ్‌గా గౌతీ జట్టులోని ఆటగాళ్లను సమానంగా చూడడం లేదనే అభిప్రాయం కొంతమందిలో ఉందట. సీనియర్ ప్లేయర్లతో పాటు జూనియర్ క్రికెటర్లతో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి త్వరగా సమసిపోకపోతే.. టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పెద్ద టోర్నీల్లో జట్టు ఐక్యత చాలా కీలకం కావడంతో.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. అప్పటికే పాకిస్తాన్ ఓటమి ఖాయమైనా.. చివరి వికెట్ పడాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పేసర్ షాహీన్ అఫ్రిది భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద కుల్దీప్ సునాయాస క్యాచ్ వదిలివేశాడు. దాంతో బంతి బౌండరీగా వెళ్లింది. దాంతో కుల్దీప్పై హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ బంతి కూడా పట్టవా అన్నట్లు సీరియస్ లుక్ ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో సూర్య వచ్చి కుల్దీప్ను సముదాయించి వెళ్లిపోయాడు. ఆ ఓవర్ చివరి బంతికి పాక్ ఆలౌట్ అయింది. అయినా కుల్దీప్ చేసిన తప్పుపై హార్దిక్ కోపంగా కనిపించాడు. మైదానంలో జరిగిన ఈ ఘటన కారణంగా కుల్దీప్ ఇంకా అలకగా ఉన్నాడట. కెప్టెన్ సూర్యపై కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా బీసీసీఐ లేదా జట్టు మేనేజ్మెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




