T20 World Cup History: ఇది తెలుసా భయ్యా.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్థాన్‌దే ఆధిపత్యం!

T20 World Cup History
x

T20 World Cup History: ఇది తెలుసా భయ్యా.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్థాన్‌దే ఆధిపత్యం!

Highlights

T20 World Cup History: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా వరల్డ్‌కప్‌కు గుర్తింపు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌.. ఏదైనా సరే ఫుల్ క్రేజ్ ఉంది.

T20 World Cup History: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా వరల్డ్‌కప్‌కు గుర్తింపు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌.. ఏదైనా సరే ఫుల్ క్రేజ్ ఉంది. ప్రతి టీమ్ ప్రపంచకప్‌ గెలవాలని కలలు కంటుంది. అయితే పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో కొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్ దశకు చేరుతూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ఈ జాబితాలో ఆసక్తికరంగా రెండు జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. అవే పాకిస్థాన్, ఇంగ్లండ్ టీమ్స్.

టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధికంగా 6 సార్లు సెమీఫైనల్స్ చేరిన జట్లలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ కూడా 6 సార్లు సెమీఫైనల్స్ చేరి పాక్‌తో సంయుక్తంగా టాప్‌లో ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ 2026 సూపర్ 8లో పాకిస్థాన్‌పైనే గెలుపుతో సెమీస్ చేరిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ టీ20 ఫార్మాట్‌లో అనిశ్చితి జట్టుగా పేరుగాంచినా.. కీలక టోర్నీల్లో మాత్రం వరుసగా నాకౌట్ దశకు చేరడం దాయాది ప్రత్యేకత. ఇంగ్లండ్ కూడా గత కొన్ని సంవత్సరాల్లో వైట్‌బాల్ క్రికెట్‌లో తమ స్థిరత్వాన్ని నిరూపిస్తూ ఈ రికార్డును సమం చేసింది.

ఇక 5 సార్లు సెమీఫైనల్స్ చేరిన భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ స్థాయి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కొన్ని కీలక మ్యాచ్‌ల్లో తడబడడంతో టీమిండియా అగ్రస్థానాన్ని అందుకోలేకపోయింది. 4 సార్లు సెమీస్ చేరిన జట్లలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ టీమ్స్ అన్ని మెగా టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలతో తమ ముద్ర వేశాయి. ముఖ్యంగా వెస్టిండీస్ రెండు టైటిళ్లు గెలుచుకోవడం ద్వారా టీ20 స్పెషలిస్ట్ జట్టుగా గుర్తింపు పొందింది.

మరోవైపు దక్షిణాఫ్రికా 3 సార్లు మాత్రమే సెమీస్ చేరగా.. ఆఫ్గనిస్తాన్ ఒక్కసారి మాత్రమే నాకౌట్ దశకు చేరింది. అయినప్పటికీ అఫ్గానిస్తాన్ వంటి జట్లు తక్కువ కాలంలోనే పెద్ద జట్లకు సవాల్ విసురుతూ ఎదుగుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ దశకు చేరడం అంటే.. జట్టు స్థిరత్వం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం, మ్యాచ్ ఫినిషింగ్ నైపుణ్యం అన్నీ ఉండాలి. ఈ జాబితాలో ఉన్న జట్లు ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories