Team India History: భారత్ మరో చారిత్రక ఘనత.. తొలి జట్టుగా అరుదైన రికార్డు!

Team India History
x

Team India History: భారత్ మరో చారిత్రక ఘనత.. తొలి జట్టుగా అరుదైన రికార్డు!

Highlights

Team India History: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు మరో చారిత్రక ఘనత సాధించింది. పరిమిత ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్లలో వరుసగా నాలుగు ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా అరుదైన రికార్డు సృష్టించింది. టీ20 వన్డే వరల్డ్ కప్ 2026 ఫైనల్ చేరడంతో టీమిండియా ఖాతాలో ఈ రికార్డు చేరింది.

Team India History: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు మరో చారిత్రక ఘనత సాధించింది. పరిమిత ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్లలో వరుసగా నాలుగు ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా అరుదైన రికార్డు సృష్టించింది. టీ20 వన్డే వరల్డ్ కప్ 2026 ఫైనల్ చేరడంతో టీమిండియా ఖాతాలో ఈ రికార్డు చేరింది. సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లాం‌డ్‌పై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ప్రారంభమైన ఈ అద్భుత ప్రయాణం.. 2026 టీ20 వరల్డ్ కప్ వరకుకొనసాగింది.

2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఆ ఫైనల్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ పోటీ పడింది. ఫైనల్లో భారత్ గెలిచి పొట్టి టోర్నీని ఖాతాలో వేసుకుంది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఢీకొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా టీమిండియా గెలుచుకుంది ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా మరోసారి న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కొననుంది. ఆదివారం (మార్చి 8) భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచులో కూడా భారత్ గెలవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

వరుసగా నాలుగు ఐసీసీ టోర్నమెంట్‌ల ఫైనల్స్‌కు చేరడం ద్వారా భారత్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో బలమైన జట్లు ఉన్నప్పటికీ..ఇలాంటి అరుదైన ఘనతను సాధించిన జట్టు ఇప్పటివరకు లేదు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నమెంట్‌ల ఫైనల్స్ చరిత్రను పరిశీలిస్తే 1975 నుంచి ఇప్పటివరకు ఎన్నో జట్లు ఫైనల్‌కు చేరాయి. కానీ వరుసగా నాలుగు ఫైనల్స్‌కు చేరడం మాత్రం ఇదే మొదటిసారి. ఇది టీమిండియా స్థిరత్వానికి, బలమైన జట్టు సమన్వయానికి నిదర్శనంగా క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత స్థిరమైన జట్టుగా భారత్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా ఫైనల్స్ చేరడం మాత్రమే కాదు.. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించే సామర్థ్యాన్ని కూడా టీమిండియా చూపిస్తోంది. మొత్తానికి వరుసగా నాలుగు ఐసీసీ ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర రాసింది. ఇక 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి మరో టైటిల్‌ను సాధిస్తుందా? అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories