The Hundred : 45 బంతుల్లో 0 పరుగులు.. ది హండ్రెడ్ లో రషీద్ ఖాన్ విధ్వంసం

The Hundred : 45 బంతుల్లో 0 పరుగులు.. ది హండ్రెడ్ లో రషీద్ ఖాన్ విధ్వంసం
x
Highlights

The Hundred: ది హండ్రెడ్ కొత్త సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే రషీద్ ఖాన్ తన సత్తా చాటాడు. ఆగస్టు 5న లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన...

The Hundred: ది హండ్రెడ్ కొత్త సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే రషీద్ ఖాన్ తన సత్తా చాటాడు. ఆగస్టు 5న లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్‌కు దిగిన లండన్ స్పిరిట్ బ్యాట్స్‌మెన్లు, ఏకంగా 45 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ టీమ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్లు ఉన్నప్పటికీ, వారు కూడా కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యారు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లండన్ స్పిరిట్ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. బ్యాటింగ్ చేసినంత సేపు ప్రత్యర్థుల బౌలింగ్‌లో ఏ మాత్రం పరుగులను రాబట్టలేకపోయారు. దీంతో తమ ఇన్నింగ్స్‌లో 100 బంతులను కూడా పూర్తి చేయలేకపోయారు. కేవలం 94 బంతుల్లో 80 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఈ జట్టు పేలవమైన ప్రదర్శనకు ప్రత్యర్థి జట్టు బౌలర్లందరూ కారణం అయినప్పటికీ, రషీద్ ఖాన్, శామ్ కరన్‌ల పాత్ర మాత్రం ఇందులో ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ తన బౌలింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కోటాలో బౌలింగ్ చేసిన 20 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ బౌలింగ్‌లో లండన్ స్పిరిట్ బ్యాట్స్‌మెన్లు ఏకంగా 15 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. రషీద్ ఖాన్ లాగే శామ్ కరన్ కూడా 19 బంతుల్లో 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే బెహ్రెన్‌డార్ఫ్ 1, జార్డన్ క్లార్క్ 2, టామ్ కరన్ 4 వికెట్లు తీసుకున్నారు.

ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుకు లండన్ స్పిరిట్ జట్టు కేవలం 81 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఈ చిన్న లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు 69 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు ది హండ్రెడ్ కొత్త సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories