PM Modi : ప్రధాని మోదీ ట్రోఫీని ఎందుకు తాకలేదు? ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలకు ఆయన ఇచ్చిన గౌరవం ఇదే

PM Modi : ప్రధాని మోదీ ట్రోఫీని ఎందుకు తాకలేదు?  ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలకు ఆయన ఇచ్చిన గౌరవం ఇదే
x

PM Modi : ప్రధాని మోదీ ట్రోఫీని ఎందుకు తాకలేదు? ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలకు ఆయన ఇచ్చిన గౌరవం ఇదే

Highlights

భారత మహిళల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025ను గెలిచి, చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

PM Modi : భారత మహిళల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025ను గెలిచి, చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చారిత్రక విజయం తర్వాత, నవంబర్ 5న జట్టు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి ప్రధాని మోదీ ఫోటో దిగారు. అయితే, ప్రధాని మోదీ ట్రోఫీని పట్టుకోకపోవడం లేదా తాకకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలిచిన తరువాత టీమ్ ఇండియా.. నవంబర్ 5న ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఉన్న ప్రధానమంత్రి నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు దిగారు. వైరల్ అవుతున్న ఫోటోల్లో ప్రధాని మోదీ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మధ్య నిలబడి కనిపించారు. అయితే, ఆయన వరల్డ్ కప్ ట్రోఫీకి పూర్తిగా దూరంగా నిలబడి, దాన్ని చేతులతో తాకకుండా జాగ్రత్త పడ్డారు.

దీని వెనుక ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం దాగి ఉంది. సాధారణంగా ఇలాంటి ప్రపంచ కప్ ట్రోఫీలను గెలిచిన ఛాంపియన్లు మాత్రమే తాకాలి లేదా పట్టుకోవాలి అనే సంప్రదాయాన్ని పాటిస్తారు. ప్రధాని మోదీ అదే సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆటగాళ్ల శ్రమకు, విజయానికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రోఫీని తాకలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా ట్రోఫీని పట్టుకోకపోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇదే సంప్రదాయాన్ని పాటించారు.

2024లో భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, వెస్టిండీస్ నుంచి నేరుగా ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీని కలిశారు. అప్పుడు కూడా ప్రధాని మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ఫోటో దిగినా, ట్రోఫీని తాకలేదు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి, ఆటగాళ్లకు పూర్తి గౌరవం ఇచ్చినందుకుగాను దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా మోదీ ఆటగాళ్లతో వారి విజయం వెనుక ఉన్న కథలను అడిగి తెలుసుకున్నారు. వారికి అభినందనలు తెలిపి, భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు చెప్పారు.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవడం భారత క్రికెట్‌కు ఒక గొప్ప చారిత్రక ఘట్టం. 1973లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు ఒక్కసారి కూడా ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది. రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్నా విజయం దక్కలేదు. ఎట్టకేలకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు ఈ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. ముఖ్యంగా సెమీఫైనల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు అయిన ఆస్ట్రేలియాను ఓడించడం (2017 తర్వాత వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు అదే మొదటి ఓటమి) భారత విజయాన్ని మరింత మధురంగా మార్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories