Mahbub Ali Zaki: మైదానంలోనే కుప్పకూలిన కోచ్.. ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ మృతి!

Mahbub Ali Zaki
x

Mahbub Ali Zaki: మైదానంలోనే కుప్పకూలిన కోచ్.. ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ మృతి!

Highlights

Mahbub Ali Zaki: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో విషాదం చోటుచేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (59) ఆకస్మికంగా మరణించారు.

Mahbub Ali Zaki: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో విషాదం చోటుచేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (59) ఆకస్మికంగా మరణించారు. ఈ దురదృష్టకర ఘటన సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజ్‍షాహీ వారియర్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి కొద్దిమునుపు చోటు చేసుకుంది.

ఆకస్మిక మరణం

మహబూబ్ అలీ జకీ అకస్మాత్తుగా మైదానంలో కుప్పకూలడంతో, వెంటనే జట్టు యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయినప్పటికీ, అతడిని రక్షించలేకపోయారు. జకీకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆకస్మిక మరణం జట్టు సభ్యులు, క్రికెట్ వర్గాలను తీవ్రంగా కలచివేసిందని అధికారులు పేర్కొన్నారు.

మహబూబ్ అలీ జకీ కోసం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు మ్యాచ్ ముందు ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం మ్యాచ్ యథావిధిగా కొనసాగింది.

క్రికెట్‌లో సేవలు

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసింది. జకీ ఫాస్ట్ బౌలర్ల అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, దేశ క్రికెట్‌లో అతని పాత్ర ముఖ్యమైనదని తెలిపింది.

క్రమశిక్షణలో ఫాస్ట్ బౌలర్‌గా పునరుత్తానం సాధించిన జకీ, కొమిల్లా జిల్లాకు, అలాగే ప్రముఖ క్లబ్ అబాహనీ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories