U19 World Cup: పదో కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే.. భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం!

U19 World Cup: పదో కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే.. భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం!
x

U19 World Cup: పదో కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే.. భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం!

Highlights

భారత క్రికెట్‌లో అండర్-19 వరల్డ్‌కప్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భవిష్యత్ స్టార్‌లను దేశానికి పరిచయం చేసిన ఈ టోర్నీ.. కెప్టెన్సీ పరంగా కూడా ఎన్నో లెజెండ్స్‌ను అందించింది.

భారత క్రికెట్‌లో అండర్-19 వరల్డ్‌కప్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భవిష్యత్ స్టార్‌లను దేశానికి పరిచయం చేసిన ఈ టోర్నీ.. కెప్టెన్సీ పరంగా కూడా ఎన్నో లెజెండ్స్‌ను అందించింది. ఇప్పుడు అదే జాబితాలో మరో కొత్త పేరు చేరింది. ఆ పేరే ఆయుష్‌ మాత్రే. 2026 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌ను నడిపించిన పదో భారత కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే చరిత్ర సృష్టించాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో యువ భారత్ అడుగు పెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. భారత్‌ కప్పు కోసం శుక్రవారం ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లీష్ జట్టు 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది.

2000లో మహమ్మద్ కైఫ్ నేతృత్వంలో భారత్ తొలి అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్‌ను సాధించింది. ఆ తర్వాత 2006లో రవికాంత్ శుక్లా జట్టు ఫైనల్‌కి చేరగా.. 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు మరోసారి ట్రోఫీని అందుకుంది. 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో భారత్ మూడో టైటిల్‌ను గెలుచుకుని.. యువ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది. 2016లో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా భారత్ ఫైనల్‌లో పోటీపడగా, 2018లో పృథ్వీ షా నాయకత్వంలో జట్టు మరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2020లో ప్రియమ్ గార్గ్ కెప్టెన్‌గా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. 2022లో యశ్ దుల్ సారథ్యంలో ఐదోసారి అండర్-19 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది.

2024లో ఉదయ్ సహరాన్ నేతృత్వంలో భారత్ ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు అయుష్ మాత్రే కెప్టెన్సీలో భారత జట్టు మరోసారి ఫైనల్‌కు చేరడం విశేషం. దీంతో అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌ను నడిపించిన 10వ కెప్టెన్‌గా అయుష్ మ్హాత్రే తన పేరును రికార్డుల్లో లిఖించుకున్నాడు. మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు అండర్-19 కెప్టెన్సీ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో అయుష్ కూడా భారత సీనియర్ జట్టుకు భవిష్యత్‌లో కీలక ఆటగాడిగా మారతాడన్న ఆశలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. భారత యువ క్రికెట్‌కు ఇది మరో గర్వకారణమైన క్షణం అనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories