WPL 2026 : ముంబై బౌలర్ల పని పట్టిన యూపీ వారియర్స్..డీవై పాటిల్ స్టేడియంలో హర్లీన్ సునామీ

WPL 2026 : ముంబై బౌలర్ల పని పట్టిన యూపీ వారియర్స్..డీవై పాటిల్ స్టేడియంలో హర్లీన్ సునామీ
x

WPL 2026 : ముంబై బౌలర్ల పని పట్టిన యూపీ వారియర్స్..డీవై పాటిల్ స్టేడియంలో హర్లీన్ సునామీ

Highlights

WPL 2026 : నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

WPL 2026 : నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్ కీలక పాత్ర పోషించింది. గత మ్యాచ్‌లో తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడుతోందని టీమ్ మేనేజ్మెంట్ ఆమెను రిటైర్డ్ అవుట్ గా వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్న హర్లీన్, ఈసారి ముంబై బౌలర్లను ఉతికి ఆరేసింది. ఏకంగా 164.10 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించి అజేయంగా నిలిచింది.

టాస్ గెలిచిన యూపీ వారియర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నెట్ సివర్ బ్రంట్ (65) హాఫ్ సెంచరీతో రాణించగా, అమన్‌జోత్ కౌర్ (38), నికోలా కేరీ (32 నాటౌట్) ఉపయోగకరమైన పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, సోఫీ ఎక్లెస్టోన్ మరియు ఆశా శోభన తలో వికెట్ తీసి ముంబైని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 18.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. హర్లీన్ డియోల్ కేవలం బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. గత మ్యాచ్‌లో 47 పరుగులు చేసినా తనను వెనక్కి పిలిచిన మేనేజ్‌మెంట్‌కు తన బ్యాటింగ్ పవర్‌తో గట్టి సమాధానం చెప్పింది. ఆమెకు తోడుగా క్లోయి ట్రయాన్ కేవలం 11 బంతుల్లోనే 27 పరుగులతో మెరుపులు మెరిపించగా, ఫీబీ లిచ్‌ఫీల్డ్ (25), కెప్టెన్ మెగ్ లానింగ్ (25) రాణించారు.

వరుస ఓటములతో సతమతమవుతున్న యూపీ వారియర్స్‌కు ఈ విజయం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించడం విశేషం. ముంబై బౌలర్లలో నెట్ సివర్ బ్రంట్ 2 వికెట్లు తీసినా లాభం లేకపోయింది. హర్లీన్ డియోల్ చూపించిన పోరాట పటిమపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories