U19 World Cup Final: యువ తుఫాన్ సూర్యవంశీ దుమ్ము రేపాడు.. భారత్‌కు వరల్డ్‌కప్ టైటిల్

U19 World Cup Final: యువ తుఫాన్ సూర్యవంశీ దుమ్ము రేపాడు.. భారత్‌కు వరల్డ్‌కప్ టైటిల్
x

U19 World Cup Final: యువ తుఫాన్ సూర్యవంశీ దుమ్ము రేపాడు.. భారత్‌కు వరల్డ్‌కప్ టైటిల్

Highlights

వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి ఆరో అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో రికార్డు స్కోర్.

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌పై 100 పరుగుల తేడాతో గెలిచి భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హరారేలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయం వైపు నడిపించాడు.

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోర్‌గా నమోదైంది. వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 సిక్సులు, 15 ఫోర్లు ఉన్నాయి. కేవలం 55 బంతుల్లో శతకం పూర్తి చేసి టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.

412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. కాలెబ్ ఫాల్కనర్ 67 బంతుల్లో 115 పరుగులు చేసి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి ఇంగ్లాండ్‌పై ఒత్తిడి కొనసాగించారు.

ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 22 సిక్సులు బాది మరో రికార్డు నెలకొల్పాడు. గతంలో డివాల్డ్ బ్రేవిస్ పేరిట ఉన్న 18 సిక్సుల రికార్డును అధిగమించాడు. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories