Vaibhav Suryavanshi: చిచ్చరపిడుగులా సిక్సర్ల వర్షం.. రికార్డు కొట్టిన యువతార!

Vaibhav Suryavanshi: చిచ్చరపిడుగులా సిక్సర్ల వర్షం.. రికార్డు కొట్టిన యువతార!
x

Vaibhav Suryavanshi: చిచ్చరపిడుగులా సిక్సర్ల వర్షం.. రికార్డు కొట్టిన యువతార!

Highlights

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రికార్డుల పతాకాన్ని ఎగరేశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ చిన్నాడు, తాజాగా యూత్ వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు.

Vaibhav Suryavanshi: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రికార్డుల పతాకాన్ని ఎగరేశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ చిన్నాడు, తాజాగా యూత్ వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు.

శనివారం ఇంగ్లండ్‌లోని వోర్సెస్టర్ వేదికగా జరిగిన నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై కేవలం 52 బంతుల్లో శతకం నమోదు చేసి ప్రపంచ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ (53 బంతుల్లో సెంచరీ) నెలకొల్పిన రికార్డును అతడిని మించిపోయాడు. మొత్తంగా 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143 పరుగులు చేసి తన జట్టు విజయానికి బలమైన పునాది వేసాడు.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 306 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలుస్తూ అసాధారణ ఫామ్‌ను కనబరిచాడు. మూడో వన్డేలో 31 బంతుల్లోనే 9 సిక్సర్లతో 86 పరుగులు సాధించడం మరో మైలురాయి.

ఇంతకుముందు 2025 ఐపీఎల్ సీజన్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌పై 38 బంతుల్లో 101 పరుగులు చేసి టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రలో చోటు సంపాదించాడు. అంతేకాదు, ఇది ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.

వైభవ్ సూర్యవంశీ ఈ చిన్న వయసులోనే తన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శిస్తూ, భారత క్రికెట్‌కు ఓ ఉజ్వల భవిష్యత్తును సూచిస్తున్నాడు. అతని ఆటతీరును గమనిస్తున్న క్రీడా విశ్లేషకులు, భవిష్యత్తులో భారత్ తరఫున అతడు స్టార్లు సరసన నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories