Varun Chakaravarthy: వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డ్.. వరుసగా 14 ఇన్నింగ్స్‌ల్లో వికెట్!

Varun Chakaravarthy
x

Varun Chakaravarthy: వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డ్.. వరుసగా 14 ఇన్నింగ్స్‌ల్లో వికెట్!

Highlights

Varun Chakaravarthy: భారత టీ20 క్రికెట్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌తో వరుసగా 14 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీసిన భారత బౌలర్‌గా రికార్డులో నిలిచాడు.

Varun Chakaravarthy: భారత టీ20 క్రికెట్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌తో వరుసగా 14 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీసిన భారత బౌలర్‌గా రికార్డులో నిలిచాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ పడగొట్టడంతో ఈ ఫీట్‌ సాధించాడు. ర్ రికార్డుతో టీమిండియా బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి ప్రాముఖ్యత మరింత పెరిగింది. వరుణ్ ఇప్పటివరకు భారత్ తరఫున 4 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. ఒన్డేల్లో 10, టీల్లో 60 వికెట్స్ తీశాడు. ఐపీఎల్ ద్వారా వరుణ్ భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

టీ20 ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌లో వికెట్ తీయడం అంటే సాధారణ విషయం కాదు. బ్యాట్స్‌మన్‌ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఈ ఫార్మాట్‌లో బౌలర్‌గా నిలకడ చూపించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తి వరుసగా 14 ఇన్నింగ్స్‌ల్లో వికెట్ పడగొట్టడం అతని స్కిల్, కంట్రోల్, మ్యాచ్ రీడింగ్‌కు నిదర్శనం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ మ్యాచ్ గమనాన్ని మార్చే బౌలర్‌గా వరుణ్ పేరు సంపాదించాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టుకు వరుణ్ కీలక స్పిన్నర్‌గా ఉన్నాడు. ఐసీసీ ట్రోఫీలో అతడు తన ఆధిపత్యం చూపిస్తున్నాడు.

భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఈ జాబితాలో పీసర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతను వరుసగా 17 ఇన్నింగ్స్‌ల్లో వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఆ రికార్డ్‌కు దగ్గరగా చేరుకోవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరో మూడు ఇన్నింగ్స్‌ల్లో వికెట్లు తీస్తే.. అర్ష్‌దీప్ రికార్డును సమం చేసే అవకాశం కూడా ఉంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో ఆ రికార్డు ఉన్నాయి. ఇదే టోర్నీలో అర్ష్‌దీప్ కూడా ఆడుతున్న విషయం తెలిసిందే. వరుణ్ ప్రస్తుత ఫామ్ చూస్తే.. భారత టీ20 జట్టుకు అతను ఎంత కీలకమైన బౌలరో మరోసారి రుజువైంది. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌పై ఒత్తిడి పెంచుతున్న వరుణ్.. రాబోయే మ్యాచ్‌ల్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories