Viral Video : భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్‌లో 1, 2 కాదు... వరుసగా చెంపలు వాయించిన మహిళ.. వీడియో వైరల్

Viral Video
x

Viral Video : భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్‌లో 1, 2 కాదు... వరుసగా చెంపలు వాయించిన మహిళ.. వీడియో వైరల్ 

Highlights

Viral Video : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది.

Viral Video: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. ఒక దశలో మూడో రోజునే మ్యాచ్ ముగుస్తుందనుకుంటే, విండీస్ బ్యాట్స్‌మెన్ పోరాటంతో ఆట ఐదో రోజుకు వెళ్లింది. ప్రస్తుతం భారత్ గెలుపు అంచున ఉంది. అయితే, నాలుగో రోజు (సోమవారం) క్రికెట్ హైలైట్స్‌తో పాటు, స్టాండ్స్‌లో జరిగిన ఓ అనూహ్య ఘటన మరింత హైలైట్ అయింది. మ్యాచ్ చూస్తున్న ఓ యువతి తన పక్కనే ఉన్న బాయ్‌ఫ్రెండ్‌పై చెంపదెబ్బల వర్షం కురిపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విండీస్ జట్టు 293 పరుగులు చేసి, 4 వికెట్లు కోల్పోయి 23 పరుగుల ఆధిక్యంలో ఉన్నప్పుడు బ్రాడ్‌కాస్ట్ కెమెరా ఒక్కసారిగా ప్రేక్షకుల స్టాండ్స్‌ వైపు మళ్లింది. ఆ సమయంలో ఒక యువతి తన పక్కనే ఉన్న యువకుడిని లేదా పార్టనర్‌ను సరదాగా పదేపదే కొట్టడం కనిపించింది. ఆమె ఒకటి, రెండు కాదు, వరుసగా చెంపలు కొట్టింది. ఈ సమయంలో ఆ యువకుడు తన చెంపపై చేయి పెట్టుకుని, నవ్వుతూ కనిపించాడు. ఈ మొత్తం దృశ్యాన్ని లైవ్ కెమెరాలో చూసిన అభిమానులు, కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



ఢిల్లీ టెస్ట్‌లో టాస్ గెలిచిన శుభ్‌మన్‌ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ గిల్ (129) సెంచరీలు చేశారు. ఆ తర్వాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్‌దీప్ యాదవ్ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. భారత్ ఫాలోఆన్ ఆడించినప్పటికీ, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో బాగా పోరాడింది.

రెండో ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) సెంచరీలు చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. వెస్టిండీస్ జట్టు భారత్‌ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (25*), సాయి సుదర్శన్ (30*) క్రీజులో ఉన్నారు. సిరీస్ గెలవడానికి భారత్‌కు ఇప్పుడు కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories