Virat Kohli : ఐపీఎల్ 2025లో ట్విస్ట్.. 24గంటల్లోనే కోహ్లీ రికార్డు బద్దలు

Virat Kohli : ఐపీఎల్ 2025లో ట్విస్ట్.. 24గంటల్లోనే కోహ్లీ రికార్డు బద్దలు
x

Virat Kohli : ఐపీఎల్ 2025లో ట్విస్ట్.. 24గంటల్లోనే కోహ్లీ రికార్డు బద్దలు

Highlights

Virat Kohli : ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్తో దుమ్మురేపుతున్నాడు. తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆరు అర్థ సెంచరీలతో 400కు పైగా పరుగులు సాధించాడు. ఏప్రిల్ 27న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఒక ప్రత్యేక జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కానీ, కేవలం 24 గంటల్లోనే ఆ అగ్రస్థానం అతడి నుంచి చేజారిపోయింది. భారత యువ బ్యాట్స్‌మెన్ ఒకరు కోహ్లీని వెనక్కి నెట్టాడు.

విరాట్ కోహ్లీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 51 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ 2025లో అతని మొత్తం పరుగులు 443కు చేరాయి. ఫలితంగా ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. గుజరాత్ టైటాన్స్ యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్‌ను వెనక్కి నెట్టాడు. అయితే, సాయి సుదర్శన్ కేవలం 24 గంటల్లోనే మళ్లీ కోహ్లీని అధిగమించాడు. ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ ఖాతాలో ఇప్పుడు 456 పరుగులు ఉన్నాయి. విశేషం ఏమిటంటే, కోహ్లీ కంటే ఒక ఇన్నింగ్స్ తక్కువ ఆడాడు. ఈ పరుగులు 50.67 సగటు, 5 అర్థ సెంచరీలతో సాధించాడు.

సాయి సుదర్శన్ మరోసారి తన జట్టుకు శుభారంభం అందించడంలో సక్సెస్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్సర్ కూడా ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీని దాటేశాడు. సాయి సుదర్శన్‌కు ఈ సీజన్ చాలా బాగా సాగుతోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్‌లో ఔటయ్యాడు. మిగిలిన ప్రతి మ్యాచ్‌లో 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ రేస్ చాలా ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ, సాయి సుదర్శన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ కూడా ఈ రేసులో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ 10 మ్యాచ్‌ల్లో 427 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. నికోలస్ పూరన్ కూడా 10 మ్యాచ్‌ల్లో 404 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ విషయానికి వస్తే తను 9 మ్యాచ్‌ల్లో 378 పరుగులు చేశాడు. వీరితో పాటు శుభ్‌మన్ గిల్ కూడా 389 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories