
West Indies Minnow Team: వెస్టిండీస్ 'మిన్నో' టీమ్.. వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
West Indies Minnow Team: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన శైలిలో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్ జట్టు 'మిన్నో టీమ్' అని పేర్కొన్నాడు.
West Indies Minnow Team: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన శైలిలో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్ జట్టు 'మిన్నో టీమ్' అని పేర్కొన్నాడు. మిన్నో టీమ్ అంటే.. అనుభవలేమి, లో ర్యాంక్ లేదా అసోసియేట్ దేశాలు అని అర్ధం. పెద్ద జట్లపై విజయాలు సాధించలేని టీమ్ విండీస్ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో వరుస విజయాలు సాధిస్తున్న వెస్టిండీస్‌పై సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో భిన్నాభిప్రాయాలకు దారి తీశాయి.
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ... 'మేము వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుగా భావించాం. కానీ చివరికి ఎప్పటిలాగే ఒత్తిడిలో కుంగిపోతుంటుంది. టాప్ జట్టుతో మ్యాచ్ ఆడితే వెస్టిండీస్ నిలబడలేదని నాకు ముందే తెలుసు' అని అన్నాడు. 'వెస్టిండీస్‌తో పోల్చితే దక్షిణాఫ్రికా ముందుంది. సఫారీ జట్టు స్థాయి, ఆటగాళ్ల నైపుణ్యం, మొత్తం జట్టు సామర్థ్యం విషయంలో విండీస్‌తో పోల్చితే చాలా బెటర్' అని వీరూ పేర్కొన్నాడు.
'టీ20 వరల్డ్‌కప్ 2026లో విండీస్ విజయాలు సాధిస్తోంది. సులభమైన గ్రూప్‌లో ఉండటం వల్ల గెలుస్తోంది. అందుకే వారిని బలమైన జట్టుగా భావించడం లేదు. పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకునే స్థిరత్వం లేకపోవడం విండీస్ ప్రధాన లోపం' అని వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొంతమంది అభిమానులు వీరూ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయడం సరికాదని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రి, వెస్టిండీస్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. రొమారియో షెఫర్డ్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా.. జాసన్ హోల్డర్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 89 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, కగిసో రబాడ 2, కార్బిన్ బాష్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 136 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 42 బంతుల్లో 41 రన్స్ మాత్రమే అసవరం. ఈ మ్యాచ్ చూస్తుంటే.. వీరూ చేసిన వ్యాఖ్యలు నిజమే అని అనిపిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




