Rohit Sharma: కారుకు సొట్ట.. బ్రదర్ పై విరుచుకుపడ్డ రోహిత్ శర్మ..వైరల్ వీడియో

Watch the video of Rohit Sharma scolding his brother for cracking the car
x

Rohit Sharma: కారుకు సొట్ట.. బ్రదర్ పై విరుచుకుపడ్డ రోహిత్ శర్మ..వైరల్ వీడియో

Highlights

Rohit Sharma: రోహిత్ శర్మ తన సోదరుడు విశాల్ పై సీరియస్ అయ్యాడు. అతనికి ఇష్టమైన కారుకు సొట్ట పడటంతో ఆ కోపాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన వాంఖడే స్టేడియంలో...

Rohit Sharma: రోహిత్ శర్మ తన సోదరుడు విశాల్ పై సీరియస్ అయ్యాడు. అతనికి ఇష్టమైన కారుకు సొట్ట పడటంతో ఆ కోపాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన వాంఖడే స్టేడియంలో చోటుచేసుకుంది. రోహిత్ శర్మ పేరుతో వాంఖడే స్టేడియంలో ఓ కొత్త స్టాండ్ ను ఏర్పాటు చేశారు. శుక్రవారం దాని ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. ఈ కార్యక్రమంలో రోహిత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే స్టాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో కార్ పార్కింగ్ ఏరియాలో రోహిత్ శర్మ ఫైర్ అయిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కారు బ్యాక్ సైడ్ సొట్టపడటంతో ఆ ప్రాంతాన్ని చూపిస్తూ సోదరుడు విశాలపై రోహిత్ సీరియస్ అయ్యాడు. యే క్యా హై అంటూ కోపంగా అడిగాడు. అయితే రివర్స్ సమయంలో ఆ విధంగా జరిగినట్లు విశాల్ చెప్పాడు. సోదరుడు ఇచ్చిన జవాబుతో మరింత ఆగ్రహానికి గురైన రోహిత్..ఎవరి వల్లా..నీ వల్లే ఇదంతా జరిగిందంటూ విశాల్ పై సీరియస్ అయ్యాడు. రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురనాథ్, పూర్ణిమా శర్మ, భార్య రితికా సజ్ దే కూడా అక్కడ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కాగా కొన్ని రోజుల క్రితమే టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories