Pahalgam Terror Attack : ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత్ vs పాక్ క్రికెట్ మ్యాచ్‌లు ఇక లేవు?

Pahalgam Terror Attack : ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత్ vs పాక్ క్రికెట్ మ్యాచ్‌లు ఇక లేవు?
x
Highlights

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై చర్య తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో...

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై చర్య తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని బీసీసీఐకి కూడా విజ్ఞప్తులు వచ్చాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐసీసీ టోర్నీల్లో భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూప్‌లో ఉంచవద్దని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని అభ్యర్థించిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ పుకార్లు, ఊహాగానాలలో ప్రస్తుతం ఎటువంటి నిజం లేదు.

భారత్ , పాకిస్థాన్ మ్యాచ్‌లు జరగకపోతే దాని మొదటి ప్రభావం సెప్టెంబర్-అక్టోబర్‌లో భారతదేశంలో జరగనున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌పై పడవచ్చు. పాకిస్థాన్ ఇటీవల దీనికి అర్హత సాధించింది. ఎనిమిది జట్ల ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడనున్నారు. ఇందులో గ్రూపింగ్ లేదు. కాబట్టి ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. అయితే మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. మహిళల ప్రపంచ కప్‌కు ముందు పురుషుల ఆసియా కప్ ఉంది. ఆసియా కప్‌కు కూడా బీసీసీఐ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఉండవని, ఈ పరిస్థితి కొనసాగుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. "బోర్డు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం వైఖరి ఇదే విధంగా ఉంటే, మేము పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడము. ఐసీసీ టోర్నమెంట్లలో మేము పాల్గొంటాము ఎందుకంటే అది వేరే అంతర్జాతీయ ఒప్పందంలో భాగం" అని అన్నారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. పహల్గామ్ దాడితో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. ఇది ఒక పిరికి చర్య.మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాము, వారి ఆత్మ శాంతికోసం ప్రార్థిస్తున్నాము. దాడిలో మరణించిన 26 మంది పౌరులకు నివాళి అర్పించడానికి ఐపీఎల్ 41వ మ్యాచ్ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 60 సెకన్ల పాటు మౌనం పాటించారు. స్టేడియం, ప్రత్యక్ష ప్రసారంలో ఈ క్షణాన్ని పంచుకున్నారు. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు బాధితులకు సంతాపం తెలిపారు. ఆటగాళ్ళు, అంపైర్‌లు , కామెంటరీ బృందం నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు. మ్యాచ్ సమయంలో ఎటువంటి సంగీతం, డీజే, చీర్‌లీడర్‌లు లేదా బాణసంచా ప్రదర్శనలు లేవు. జాతీయ దుఃఖాన్నిచ గౌరవాన్ని చూపించడానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories