MS Dhoni: దేశం కోసం మళ్లీ సైనికుడిగా మారుతున్న ధోని? వైరల్ అవుతున్న వార్తలు

Will MS Dhoni Don Army Uniform Against Pakistan Big Decision Taken Amidst Tension
x

MS Dhoni: దేశం కోసం మళ్లీ సైనికుడిగా మారుతున్న ధోని? వైరల్ అవుతున్న వార్తలు

Highlights

MS Dhoni: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ కింద భారత్ పాకిస్తాన్, PoKలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.

MS Dhoni: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ కింద భారత్ పాకిస్తాన్, PoKలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇంకా తన బుద్ధి మార్చుకోవడం లేదు. మే 8 రాత్రి పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై వైమానిక దాడులకు ప్రయత్నించింది. దీని తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని అనేక నగరాల్లో ప్రతిదాడి చేసింది. అలాగే శుక్రవారం రాత్రి కూడా 100కు పైగా డ్రోన్లతో దాడికి దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.

సైనిక దుస్తుల్లోకి దిగనున్నారా ధోని?

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక దళాధిపతికి ప్రత్యేక అధికారాలు ఇస్తూ టెరిటోరియల్ ఆర్మీని భారతీయ బలగాలకు సహాయం చేయమని ప్రభుత్వం కోరింది. టెరిటోరియల్ ఆర్మీ భారతదేశంలోని ఒక పారామిలటరీ దళం, ఇది రెగ్యులర్ ఆర్మీకి సహాయం చేస్తుంది. టెరిటోరియల్ ఆర్మీ సభ్యులు ఉద్యోగం, వారి స్వంత పని చేసుకోవచ్చు. దానితో పాటు, అవసరమైనప్పుడు దేశానికి సేవ చేస్తారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా ఈ ఆర్మీలో భాగమే. మహేంద్ర సింగ్ ధోనీకి 2011లో భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. అతను 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌కు అనుబంధంగా ఉన్నాడు.

ట్రైనింగ్ తీసుకున్న ధోని

2015లో ఎంఎస్ ధోని పారాట్రూపర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాడు. ఆగ్రాలో ట్రైనింగ్ సమయంలో భారత సైన్యం విమానం నుండి 5 సార్లు పారాచూట్‌తో దూకాడు. దీని తర్వాత 2019లో కూడా అతను 2 వారాల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2019లో ధోని కాశ్మీర్‌లో 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌తో సమయం గడిపాడు. ఈ సమయంలో అతను గస్తీ, అనేక సైనిక కార్యకలాపాలలో పాల్గొన్నాడు.

ఐపీఎల్‌లో ఆడుతున్న ధోని

ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను ఇప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అతను ఐపీఎల్ 2025లో ఆటగాడిగా బరిలోకి దిగాడు. అయితే మధ్య సీజన్‌లో అతను మరోసారి జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025 నిలిపివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లీగ్ ఎప్పుడు తిరిగి వస్తుందో అప్పుడు ధోని మరోసారి మైదానంలో కనిపిస్తాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories