WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

WTC Final
x

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

Highlights

WTC Final: గతసారి భారత జట్టును ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, ఈసారి తన టైటిల్‌ను కాపాడుకోవడానికి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

WTC Final: గతసారి భారత జట్టును ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, ఈసారి తన టైటిల్‌ను కాపాడుకోవడానికి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. రెండుసార్లు ఫైనల్ ఆడిన భారత జట్టు ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూన్ 11న ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ డ్రా అయినా లేదా రద్దైనా, ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంటుంది అనే ప్రశ్న తలెత్తుతోంది.

వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

ఒకవేళ వర్షం లేదా మరేదైనా కారణం వల్ల ఈ కీలకమైన మ్యాచ్ రద్దయితే, లేదా రెండు జట్ల మధ్య మ్యాచ్ డ్రా అయితే, అప్పుడు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలను సంయుక్తంగా విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ జూన్ 16న అడిషినల్ డేను కూడా కేటాయించింది. అంటే, వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే దానిని ఒక రోజు పాటు పొడిగించవచ్చు. ఇలా చేయడం వల్ల మ్యాచ్‌కు ఒక స్పష్టమైన ఫలితం వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది.

డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ జూన్ 11 నుండి 15 వరకు లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. ఈ సమయంలో వర్షం పడే అవకాశం ఉందని అంచనా. లార్డ్స్‌లో మొదటి, చివరి రోజు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీనితో పాటు ఐదు రోజుల లోపల కూడా వర్షం పడొచ్చని చెబుతున్నారు. దీనివల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడవచ్చు.

ప్రైజ్ మనీ ఎంత?

ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టు భారీగా డబ్బు సంపాదించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన జట్టుకు 30 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇది ఐపీఎల్ 2025 విజేతకు లభించే ప్రైజ్ మనీ కంటే 10 కోట్ల రూపాయలు ఎక్కువ. రన్నరప్ జట్టుకు 18 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఒకవేళ రెండు జట్లు సంయుక్తంగా విజేతలుగా నిలిస్తే, ఈ ప్రైజ్ మనీని రెండు జట్లకు సమానంగా పంచుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories