AI అద్భుతం.. వేల సంవత్సరాల సమస్యను క్షణాల్లో సాల్వ్ చేసిన వైనం!

AI అద్భుతం.. వేల సంవత్సరాల సమస్యను క్షణాల్లో సాల్వ్ చేసిన వైనం!
x

AI అద్భుతం.. వేల సంవత్సరాల సమస్యను క్షణాల్లో సాల్వ్ చేసిన వైనం!

Highlights

ఇప్పటికే సుమారు 20,000 ఫోటోలను సేకరించింది. చెట్లకు సంబంధించిన సమస్త సమాచారం ఏఐ డేటా బేస్‌తో అనుసంధానమై ఉంటుంది.

AI..ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హవానే...! మెల్లమెల్లగా మన జీవితంలోకి పూర్తిగా అడుగుపెట్టబోతోంది AI. ఈ టెక్నాలజీ మనిషి సాధించలేని కష్టమైన పనులను కూడా సులువుగా చేస్తుంది. అలానే మనిషికి పని మనిషిగా కూడా ఉపయోగపడుతుంది. ఇంటి పని, వంటపని అలాగే తోట పని ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా క్షణాల్లో చేసేస్తుంది. ఇక్కడ తోట పని అంటే ఓ నాలుగు చెట్ల పని అనుకునేరు...నాలుగు ఎకరాల పంట పని కూడా క్షణాల్లో ముగించేస్తుంది ఈ AI. నమ్మకం కలగడంలేదా అయితే జపాన్‌కు వెళ్దాం పదండి.

జపాన్‌లోని చెర్రీ బ్లాసమ్స్, సాకురా లాంటి మొక్కలు ఎంతో అందంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి వసంత రుతువు వచ్చేముందు ఇంకా ఎంతో అందంగా ఉంటాయి. అందుకే వీటిని ఆ సమయంలో చూడడానికి టూరిస్టులు క్యూ కడతారు. అయితే వీటికి ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. జపాన్‌లోని అనేక ప్రసిద్ధ చెర్రీ వృక్షాలు ఇప్పుడు బాగా పెద్దవైపోయాయి. ఈ చెట్లలో చాలా వరకు 70 నుంచి 80 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాయి. అంటే వీటి ఎదుగుదల ఇక నుంచి చాలా కష్టం. దీని వల్ల వాటి నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు వాటి భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ఈ చెర్రీ బ్లాసమ్ చెట్ల ఎక్కువగా పాడవవడానికి కారణం వాతావరణంలో వస్తున్న వేడి గాలులే అని నిపుణులు చెబుతున్నారు. జపాన్ వాతావరణ సంస్థ గత సంవత్సరం రికార్డులో అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న ఓ ఆందోళనకరమైన మార్పు. ఈ పర్యావరణ మార్పుల వల్ల అందమైన ఈ చెట్లు నాశనమైపోతున్నాయని జపాన్ స్థానికులు వాపోతున్నారు.

తరతరాల పాటు ఉన్న ఈ అందమైన చెట్లను సంరక్షించేందుకు ఒక వినూత్నమైన AI విధానాన్ని రూపొందించారు. జపాన్‌కు చెందిన కిరిన్ హోల్డింగ్స్ అనే బ్రూవరీ సంస్థ సాకురా AI కెమెరా అనే అత్యాధునిక AI టూల్ ని సృష్టించింది. ఈ స్మార్ట్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లతో తీసిన చెర్రీ చెట్ల ఫోటోలను ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని, వయస్సును అంచనా వేయవచ్చు. ఈ AI కెమెరా, చెట్టు స్థితిని ఐదుస్థాయిల స్కేల్‌లో పరిశీలిస్తుంది. అంటే ఆ చెట్టు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న వివరాలను క్షణాల్లో సమాచారాన్ని అనలైజ్ చేసి రేటింగ్ ఇస్తుంది. ఒక చెట్టు దట్టమైన, శక్తివంతమైన పుష్పాలతో కొమ్మల చివరల వరకు నిండి ఉంటే, అది అత్యధిక రేటింగ్ పొందుతుంది. ఇప్పటికే సుమారు 20,000 ఫోటోలను సేకరించింది. చెట్లకు సంబంధించిన సమస్త సమాచారం ఏఐ డేటా బేస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ AI సాధనం బలహీనంగా ఉన్న చెట్లను గుర్తించడమే కాకుండా, వాటి సరైన ఎదుగుదలకు సహాయపడే సూచనలు చేస్తుంది. సాకురా AI కెమెరా లాంటి వినూత్న టెక్నాలజీ వల్ల భవిష్యత్ తరాలు కూడా ఈ చెర్రీ బ్లాసమ్ ఆకర్షణీయమైన వైభవాన్ని ఆస్వాదించే అవకాశం కలిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories