AI Impact Summit 2026: సౌత్‌లో తొలి ఏఐ మహాసభ.. ఢిల్లీకి వస్తున్న టెక్ దిగ్గజాల లిస్ట్ ఇదే!

AI Impact Summit 2026: సౌత్‌లో తొలి ఏఐ మహాసభ.. ఢిల్లీకి వస్తున్న టెక్ దిగ్గజాల లిస్ట్ ఇదే!
x

AI Impact Summit 2026: సౌత్‌లో తొలి ఏఐ మహాసభ.. ఢిల్లీకి వస్తున్న టెక్ దిగ్గజాల లిస్ట్ ఇదే!

Highlights

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలక అంతర్జాతీయ వేదికగా 'ఏఐ ఇంపాక్ట్ సమిట్' 2026భారత్‌లో జరగనుంది.

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలక అంతర్జాతీయ వేదికగా 'ఏఐ ఇంపాక్ట్ సమిట్' 2026భారత్‌లో జరగనుంది. ఈ సమిట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించబడుతుంది. ఈ సమ్మిట్‌ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న తొలి ప్రపంచ స్థాయి ఏఐ సమిట్‌గా ఇది చరిత్రలో నిలవనుంది.

ఈ మహాసభ ఏఐ విధానాలు, పరిశోధన, పరిశ్రమ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలకు కేంద్రంగా నిలవనుంది. ముఖ్యంగా ఇండియా ఏఐ మిషన్ అండ్ డిజిటల్ ఇండియా కార్యక్రమంల ద్వారా జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా గ్లోబల్ చర్చలను అభివృద్ధి ఫలితాలుగా మార్చడమే ఈ సమిట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ సమిట్‌కు ప్రపంచ టెక్నాలజీ రంగంలోని దిగ్గజాలు హాజరుకానున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై, మిస్ట్రల్ ఏఐ సీఈఓ ఆర్థర్ మెన్ష్ హాజరు కానున్నారు. అలాగే ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఈ సమిట్‌లో పాల్గొననున్నారు.

ఈ సమిట్‌లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, అక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్, క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా వంటి ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. ఏఐ రంగంలోని లెజెండరీ శాస్త్రవేత్తలైన యాన్ లెకన్, యోషువా బెంజియో కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. భారతదేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకణి, భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పాల్గొననున్నారు. అలాగే టీసీఎస్ సీఈఓ కె. కృథివాసన్, ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్, హెచ్సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా కూడా ఈ సమిట్‌లో పాల్గొననుండడం విశేషం.

ఈ సమిట్‌ను మూడు ప్రధాన సూత్రాలపై నిర్వహించనున్నారు. అవి.. People (ప్రజలు), Planet (భూమి), Progress (పురోగతి). బహుళ పాక్షిక సహకారాన్ని ప్రతిబింబించే ఏడు చక్రాలు కూడా ఈ సమిట్‌లో కీలక పాత్ర పోషించనున్నాయి. వాటిలో హ్యూమన్ క్యాపిటల్, సామాజిక సాధికారత కోసం సమావేశం, సురక్షితమైన అండ్ నమ్మదగిన ఏఐ, స్థిరత్వం, సైన్స్, ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ, ఆర్థిక వృద్ధికి ఏఐ వంటి అంశాలు ఉన్నాయి. సమిట్‌లో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, విద్య, ఫైనాన్స్, పరిపాలన, ప్రజాసేవలు వంటి కీలక రంగాల్లో ఏఐ వినియోగంపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఏఐ భవిష్యత్తులో భారత్ పాత్రను మరింత బలపరిచే దిశగా, గ్లోబల్ సౌత్ స్వరాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించే ముఖ్యమైన ఘట్టంగా ఈ సమిట్ నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories