Amazon Valentines Day Sale: అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్! 

Amazon announces huge discounts on these smartphones in Valentines Day sale 2025
x

Amazon Valentines Day Sale: అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్!

Highlights

Amazon Valentines Day Sale: అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ ప్రకటించింది. సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ అమేజాన్ సేల్...

Amazon Valentines Day Sale: అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ ప్రకటించింది. సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ అమేజాన్ సేల్ మీకు ఫోన్ కొనడానికి చక్కటి అవకాశం ఇస్తోంది. సేల్‌లో చాలా పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా ప్రీమియం బ్రాండ్‌లకు చెందిన కొన్ని మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు తక్కువ ధరలో గొప్ప ఫీచర్లను ఆస్వాదించవచ్చు. అస్సలు మిస్ చేయకూడని 3 బెస్ట్ డీల్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

OnePlus Nord CE4

జాబితాలో మొదటి ఫోన్ వన్‌ప్లస్ నార్ట్ CE4. కంపెనీ గత సంవత్సరం ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆ సమయంలో ఫోన్ ధర రూ. 24,999, కానీ ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్‌లో రూ. 21,999 మాత్రమే. ఫోన్‌లో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా వన్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2,000, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై రూ. 1500 వరకు ఆదా చేయచ్చు.

iQOO Z9s 5G

అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్‌లో ఐక్యూ ఈ ఫోన్ కూడా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 25,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 19,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌పై ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో మీరు రూ. 1500 వరకు ఆదా చేయచ్చు.

Samsung Galaxy S23 Ultra 5G

అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీపై గొప్ప డీల్ అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ని రూ. 1,49,999కి లాంచ్ చేసింది. ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 71,999కి మీ సొంతం చేసుకోచ్చు. అలానే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో రూ. 2,000 వరకు ఆదా చేయచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories