Samsung Galaxy S24 Ultra 5G: రూ.లక్ష ఫోన్ సగం ధరకే.. అమెజాన్ డీల్స్ దద్దరిల్లాయ్..

Samsung Galaxy S24 Ultra 5G: రూ.లక్ష ఫోన్ సగం ధరకే.. అమెజాన్ డీల్స్ దద్దరిల్లాయ్..
x
Highlights

ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో దీపావళి ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్‌లను అందిస్తోంది.

Samsung Galaxy S24 Ultra 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో దీపావళి ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్‌లను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సేల్‌లో Samsung Galaxy S24 Ultraపై ఉన్న ఆఫర్ అందరిని ఆకర్షిస్తోంది. ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం 44శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా, కంపెనీ బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది, దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. అలానే నో-కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్ గతేడాది పవర్‌ఫుల్ ఫీచర్లతో లాంచ్ అయింది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.1,34,999 కు లాంచ్ చేసింది, కానీ ఇప్పుడు అమెజాన్ దీపావళి సేల్‌లో ఈ ఫోన్‌ను కేవలం రూ.75,749 కు కొనుగోలు చేయచ్చు, అంటే 44శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇది మాత్రమే కాదు, కంపెనీ ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై రూ.1,000 వరకు తగ్గింపు పొందచ్చు. అదనంగా ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ‌పై రూ.1,000 డిస్కౌంట్ దక్కించుకోవచ్చు.

ఈ అల్ట్రా ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఫోన్‌లో 6.8-అంగుళాల LTPO AMOLED 2X డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ HDR10 ప్లస్‌కు మద్దతు ఇస్తుంది. 2600 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో 3X జూమ్ లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 256జీబీ నుండి 1టీబీ వరకు ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories