iPhone 15 Plus Big Price Drop: ఓ కన్నేయండి.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేస్తే సరీ..!

iPhone 15 Plus Big Price Drop: సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు చాలా ఖరీదైనవి. అందుకే వాటిని కొనడానికి, ప్రజలు అవి చౌకగా మారే వరకు వేచి చూస్తుంటారు.

Vamsi Krishna
Published on: 9 May 2025 11:35 AM IST
iPhone 15 Plus Big Price Drop : ఓ కన్నేయండి.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేస్తే సరీ..!
X

iPhone 15 Plus Big Price Drop : ఓ కన్నేయండి.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేస్తే సరీ..!

iPhone 15 Plus Big Price Drop: సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఐఫోన్‌లు చాలా ఖరీదైనవి. అందుకే వాటిని కొనడానికి, ప్రజలు అవి చౌకగా మారే వరకు వేచి చూస్తుంటారు. లేదా ఫెస్టివల్ సీజన్ కోసం వేచి ఉంటారు. మీరు ఐఫోన్ కొనాలనుకుంటే మీకు ఇది గొప్ప అవకాశం. ఐఫోన్ 15 ప్లస్‌ను చాలా చౌక ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, కస్టమర్లు ఐఫోన్ 15 128GB, 256GB వేరియంట్‌లను భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో మీరు చాలా సరసమైన ధరలకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, ఐఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ తన కస్టమర్లకు ఐఫోన్‌లపై భారీ ఫ్లాట్ డిస్కౌంట్లను అందించడమే కాకుండా, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా కూడా అందిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ గురించి వివరంగా తెలుసుకుందాం.

iPhone 15 Plus Discounts

ఐఫోన్ 15 ప్లస్ బేస్ వేరియంట్ అంటే 128GB మోడల్ ధర ప్రస్తుతం రూ. 89,900. ఈ సమయంలో భారీ తగ్గింపుతో కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్‌లో, A16 బయోనిక్ చిప్‌సెట్‌తో కూడిన ఈ ఐఫోన్‌పై కస్టమర్లకు 19శాతం తగ్గింపును అందిస్తున్నారు. డిస్కౌంట్ తో, మీరు దీన్ని కేవలం రూ. 72,900 కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌లోనే మీరు మొత్తం రూ. 17,000 ఆదా చేసుకోవచ్చు.

అమెజాన్ ఇందులో కొన్ని బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే, దానిపై మీకు రూ. 1750 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, మీరు షాపింగ్ పై రూ.3,645 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందుతారు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు దానిని EMIలో కూడా కొనుగోలు చేయచ్చు. మీరు 6 నెలల EMI తీసుకుంటే నెలకు రూ. 12,150 మాత్రమే చెల్లించాలి.

iPhone 15 Plus Exchange Offers

కోట్లాది మంది కస్టమర్ల కోసం ఐఫోన్ 15 ప్లస్‌పై అమెజాన్ గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందించింది. ఈ ఆఫర్‌లో మీరు ఇతర ఆఫర్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు. అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా దీనిపై రూ.64,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కస్టమర్లకు అందిస్తోంది. అంటే, మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దానిని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.64 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే పాత ఫోన్ భౌతిక స్థితిపై మాత్రమే కంపెనీ మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తుంది. ఈ ఆఫర్‌లో మీరు రూ.40,000 ఆదా చేస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రూ.30,000కే పొందుతారు.

iPhone 15 Plus Specifications

ఐఫోన్ 15 ప్లస్ అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన గ్లాస్ బ్యాక్ డిజైన్‌‌తో లాంచ్ అయింది. వాటర్, డస్ట్ నుండి పూర్తిగా సురక్షితంగా ఉండేలా కంపెనీ దీనికి IP68 రేటింగ్ ఇచ్చింది. ఈ ఐఫోన్‌లో 6.7-అంగుళాల పెద్ద శక్తివంతమైన సూపర్ రెటినా డిస్‌ప్లే ఉంది. కంపెనీ డిస్‌ప్లేలో డాల్బీ విజన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ iOS 17 కి పూర్తిగా సపోర్ట్ ఇస్తుంది. దీనికి యాపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ ఇచ్చారు. ఐఫోన్ 15 ప్లస్‌లో 6జీబీ వరకు ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌ఉంది, దీనిలో 48 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లు అందించారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీ 4383mAh బ్యాటరీతో వస్తుంది.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story