iPhone 17 Series: నెక్స్ట్ లెవల్ అప్‌డేట్... ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది

iPhone 17 Series: నెక్స్ట్ లెవల్ అప్‌డేట్... ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది
x
Highlights

iPhone 17 Series: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదలైనప్పటి నుంచి iPhone 17 లైనప్ పుకార్లతో మార్కెట్ ఇప్పటికే వేడెక్కెంది. కొత్త ఐఫోన్ సెప్టెంబర్ 2025లో...

iPhone 17 Series: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదలైనప్పటి నుంచి iPhone 17 లైనప్ పుకార్లతో మార్కెట్ ఇప్పటికే వేడెక్కెంది. కొత్త ఐఫోన్ సెప్టెంబర్ 2025లో విడుదల కానుంది. ఐఫోన్ 17 లైనప్ డిజైన్, కెమెరా ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌ల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ iPhone 17 సిరీస్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Apple iPhone 17 Features - యాపిల్ ఐఫోన్ 17 ఫీచర్స్

ఐఫోన్ 17 నాలుగు మోడల్స్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అందులో ఐపోన్ 17, ఐపోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, కొత్త మోడల్ ఐఫోన్ 17 Slim లేదా Air రూపంలో వస్తుంది. బేస్ ఐఫోన్ 17 ప్రస్తుత 6.1-అంగుళాల నుండి పెద్ద 6.3-అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉండవచ్చు. అదనంగా ప్రో-మోషన్ టెక్నాలజీ ఇప్పుడు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

iPhone 17 Camera ఐఫోన్ 17 కెమెరా సెటప్

ప్రస్తుత యాపిల్ ఫోన్‌లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండగా, కొత్త ఫోన్‌లో 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. హై క్వాలిటీ మొబైల్ ఫోటోగ్రఫీకి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, కొత్త సిరీస్‌లో మెరుగైన సెల్ఫీలు, మెరుగైన లో లైటింగ్ ఫోటోగ్రఫీ కెమెరాలు ఉంటాయని భావిస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ కొత్త యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను కలిగి ఉండచ్చు.

ఇది ఇప్పటికే ఉన్న సిరామిక్ షీల్డ్ కంటే పటిష్టమైనది, స్క్రాచ్-రెసిస్టెంట్. అన్ని మోడల్స్ యాపిల్ తదుపరి తరం A19 చిప్‌తో నడుస్తాయనే టాక్ ఉంది. ఇది వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌తో రావచ్చు. అదనంగా ఇది కస్టమ్ బ్లూటూత్, Wi-Fi 7 చిప్స్ వంటి కనెక్టివిటీతో వస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 భారతదేశంలో రూ. 79,900 ప్రారంభ ధరతో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories