
Apple WWDC 2025 Event జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరగనుంది. టిమ్ కుక్ నేతృత్వంలో యాపిల్ కొత్త iOS 26, iPadOS 26, macOS Tahoe, visionOS అప్‌డేట్స్‌తో పాటు AI ఇంటిగ్రేషన్‌పై కీలక ప్రకటనలు చేయనుంది. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
WWDC 2025: యాపిల్ ప్రేమికులకు పండుగే!
టెక్ ప్రపంచం ఎదురుచూస్తున్న అతి పెద్ద ఈవెంట్లలో ఒకటైన Apple WWDC 2025 (WorldWide Developers Conference) ఈసారి జూన్ 9 నుంచి ప్రారంభమవుతోంది.
1.ఈ ఈవెంట్ జూన్ 9 నుండి జూన్ 13 వరకు కొనసాగుతుంది.
2.భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్రతీ ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) కీనోట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ప్రకటించనున్నారు.
ఎక్కడ జరుగుతుంది, ఎలా చూడాలి?
ఈ భారీ ఈవెంట్ యాపిల్ హెడ్‌క్వార్టర్స్ అయిన క్యూపర్టినో (California)లోని Apple Parkలో జరుగనుంది.
యాపిల్ అభిమానులు ప్రపంచం నలుమూలల నుంచి ఈ ఈవెంట్‌ను ఫ్రీగా లైవ్‌లో చూడొచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ చూడగల ప్లాట్‌ఫార్మ్స్:
- Apple అధికారిక వెబ్‌సైట్
- Apple YouTube ఛానల్
- Apple TV యాప్
Apple TV App ద్వారా నేరుగా టీవీలో కూడా చూడవచ్చు.
ఏం రాబోతోందంటే?
ఈ సంవత్సరం WWDC 2025లో యాపిల్ అనేక బిగ్ అప్‌డేట్స్ ప్రకటించే అవకాశం ఉంది.
టెక్ నిపుణుల అంచనాల ప్రకారం:
- కొత్త HomeOS (Smart Home OS)
- Apple iOS 26, iPadOS 26, macOS Tahoe, watchOS 26, visionOS 26 లాంటివి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అదేవిధంగా, యాపిల్ AI Integration పై కూడా దృష్టి పెట్టింది. డెవలపర్లకు తమ యాప్‌ల్లో Artificial Intelligence Features జోడించేందుకు Apple Foundation Models Access ఇవ్వబోతుందనే సమాచారం ఉంది.
AI ఆధారిత ఫీచర్లు రాబోతున్నాయా?
WWDC 2025లో AI Battery Optimization, Smart Siri Updates, AI Health Features, అలాగే Vision Pro Eye Scrolling & Controller Support వంటి కొత్త అప్‌డేట్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎందుకు ఈ ఈవెంట్ స్పెషల్?
ప్రతీ సంవత్సరం యాపిల్ WWDC వేదికగా కొత్త సాఫ్ట్‌వేర్, డెవలపర్ టూల్స్, మరియు ఏఐ ఫీచర్లు పరిచయం చేస్తుంది. ఈసారి అయితే AI & Machine Learning Integration ప్రధాన ఫోకస్‌గా ఉండనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




