Best Mobile Phones: అమెజాన్ సేల్.. టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. భారీగా ఆఫర్లు..!

Best Mobile Phones
x

Best Mobile Phones: అమెజాన్ సేల్.. టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. భారీగా ఆఫర్లు..!

Highlights

Best Mobile Phones: పండుగ సీజన్ కారణంగా చాలా ఖరీదైన ఫోన్లు ఇప్పుడు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

Best Mobile Phones: పండుగ సీజన్ కారణంగా చాలా ఖరీదైన ఫోన్లు ఇప్పుడు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు దీపావళి సేల్ సద్వినియోగం చేసుకొని అనేక టాప్-బ్రాండెడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్‌లను అతి తక్కువ నో-కాస్ట్ ఈఎమ్ఐ రేట్లకు కూడా ఆర్డర్ చేయచ్చు. మీకు ఇష్టమైన మొబైల్ ఫోన్‌ను కూడా అతి తక్కువ ఈఎమ్ఐ రేట్లకు కొనుగోలు చేయచ్చు.ఈ టాప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్‌ల మోడల్‌లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేయడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు పొందచ్చు.

వన్‌ప్లస్

ఈ వన్‌ప్లస్ ఫోన్ బ్లాక్ ఇన్ఫినిటీ కలర్‌లో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ అందించారు. దీనిని భారీ టాస్క్‌ల కోసం ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ ఫైల్‌లు,అప్లికేషన్‌లను సులభంగా స్టోర్ చేయచ్చు. కెమెరా సెటప్ కూడా అద్భుతమైన క్వాలిటీని అందిస్తుంది, అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది. మీరు అమెజాన్ నుండి రూ.27,999కి కొనుగోలు చేయచ్చు.

వివో

ఇది వివో నుండి వచ్చిన ప్రీమియం-లుకింగ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. డిజైన్ కూడా చాలా అట్రాక్డ్‌గా ఉంటుంది. ఫోన్‌లో 6.31-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది గూగుల్ జెమినితో వస్తుంది. అద్భుతమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. దీని ప్రాసెసర్, కెమెరా కూడా అద్భుతంగా ఉంటాయి. అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ.59,998 కు నో-కాస్ట్ ఈఎమ్ఐ, అదనపు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో

ఇది ఒప్పో నుండి వచ్చిన టాప్-ఆఫ్-ది-లైన్ స్మార్ట్‌ఫోన్, ఇందులో 12జీబీ ర్యామ్, వేగవంతమైన ప్రాసెసర్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50MP 3.5X టెలిఫోటో కెమెరా ఉంది. దీనితో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయచ్చు. ఫోన్ కెమెరాతో 60 fps వద్ద HDR వీడియోలను క్యాప్చర్ చేయచ్చు. ఇది 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. దీని ధర రూ.42,999.

Show Full Article
Print Article
Next Story
More Stories