Budget Tablets: బడ్జెట్ ధరలో 'బెస్ట్' ట్యాబ్ కొనాలా? రూ.15 వేల లోపు టాప్ ఆప్షన్స్ ఇవే!

Budget Tablets: బడ్జెట్ ధరలో బెస్ట్ ట్యాబ్ కొనాలా? రూ.15 వేల లోపు టాప్ ఆప్షన్స్ ఇవే!
x

Budget Tablets: బడ్జెట్ ధరలో 'బెస్ట్' ట్యాబ్ కొనాలా? రూ.15 వేల లోపు టాప్ ఆప్షన్స్ ఇవే!

Highlights

స్టూడెంట్స్, ఆఫీస్ యూజ్‌కు సరైన ఎంపికలు.. రూ.15 వేల లోపు బెస్ట్ బడ్జెట్ ట్యాబ్లెట్లపై పూర్తి గైడ్!

ఈ రోజుల్లో విద్యార్థుల చదువులకు, ఆన్‌లైన్ క్లాసులకు లేదా నోట్స్ రాసుకోవడానికి టాబ్లెట్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారింది. అయితే, భారీ ధరలు పెట్టలేక తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న టాబ్లెట్ కోసం వెతికే వారికి మార్కెట్లో ఇప్పుడు అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోరీలో తక్కువ ధరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ టాబ్లెట్లను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. మీకు ధర'లో మంచి ఫీచర్లు కావాలంటే..

Redmi Pad SE (6GB + 128GB)

ధర: సుమారు రూ.12,999

ఇది ఎవరికి బెస్ట్ అంటే.. బడ్జెట్ తక్కువగా ఉండి, క్లాసులు వినడానికి పెద్ద స్క్రీన్ (11 ఇంచులు) కావాలనుకునే విద్యార్థులకు ఇది పర్ఫెక్ట్ అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్నాప్‌డ్రాగన్ 680 ప్రొసెసర్ రోజువారీ పనులకు అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

2. realme Pad 2 (4G LTE)

ధర: సుమారు రూ.13,999

ఇది ఎవరికి బెస్ట్ ఛాయిస్ అంటే.. బయట తిరుగుతూ చదువుకునే వారికి లేదా ఇంట్లో వైఫై లేని వారికి ఇది మంచి ఎంపికగా చెబుతున్నారు. ఇందులో 4G సమ్ సపోర్ట్ ఉంది. 11.5 ఇంచుల పెద్ద స్క్రీన్, మీడియాటెక్ G99 చిప్‌సెట్‌తో మల్టీ టాస్కింగ్ ఈజీగా చేయొచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

3. OPPO Pad SE (SuperVOOC Charger)

ధర: సుమారు రూ.13,999

ఎవరికి మంచి ఎంపిక అంటే.. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా రావాలి అనుకునే వారికి OPPO Pad SE ట్యాబ్ కరెక్ట్ అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో 9340mAh భారీ బ్యాటరీ ఉంది. గేమింగ్, చదువు రెండింటినీ ఇది బ్యాలెన్స్ చేస్తుందన్నారు.

4. OnePlus Pad Lite

ధర: సుమారు రూ.15,590

ఇది ఎవరికి బెస్ట్ అంటే : బడ్జెట్ కొంచెం పెంచగలిగితే, వన్‌ప్లస్ బ్రాండ్ వాల్యూతో పాటు మంచి బ్యాటరీ (9340mAh) కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా పని చేస్తుందని చెబుతున్నారు. వీడియో కంటెంట్ చూడటానికి దీని డిస్‌ప్లే చాలా బాగుంటుందని పేర్కొన్నారు.

ఓవరాల్ గా చూసుకుంటే, మీ ప్రాధాన్యత కేవలం తక్కువ ధర అయితే రెడ్మీ, సిమ్ కార్డ్ వాడాలనుకుంటే రియల్‌మీ, లేదా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే ఒప్పో లేదా వన్‌ప్లస్ మోడల్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఐదు టాబ్లెట్లు కూడా బడ్జెట్ ధరలో విద్యార్థులకు, ఆఫీస్ పనులకు పర్ఫెక్ట్ ఆల్ రౌండర్లుగా నిలుస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories