Boat smart ring: ఈ రింగ్‌ మీ గురించి చెప్పేస్తుంది.. బోట్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్‌

Boat smart ring: ఈ రింగ్‌ మీ గురించి చెప్పేస్తుంది.. బోట్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్‌
x

Boat smart ring: ఈ రింగ్‌ మీ గురించి చెప్పేస్తుంది.. బోట్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్‌

Highlights

Boat smart ring: స్మార్ట్ రింగ్ యాక్టివ్‌ పేరుతో ఈ రింగ్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ రింగ్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేశారు.

Boat smart ring: మొన్నటి వరకు స్మార్ట్‌ఫోన్‌లు ఆ తర్వాత స్మార్ట్‌ వాచ్‌లు ఇప్పుడు స్మార్ట్‌ రింగ్‌ల హవా నడుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ రింగ్స్‌ సందరడి చేస్తున్నాయి. రోజుకో కంపెనీ మార్కెట్లోకి స్మార్ట్‌ రింగ్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే సామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలు స్మార్ట్‌ రింగ్స్‌ను లాంచ్‌ చేయగా. తాజాగా భారత్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం బోట్‌ సైతం మార్కెట్లోకి స్మార్ట్‌ రింగ్‌ను తీసుకొచ్చింది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో బోట్‌ ఈ స్మార్ట్‌ రింగ్‌ను లాంచ్‌ చేసింది.

స్మార్ట్ రింగ్ యాక్టివ్‌ పేరుతో ఈ రింగ్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ రింగ్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. ఈ రింగ్ ఫీచర్ల విషయానికొస్తే.. స్మార్ట్‌ వాచ్‌లు చేసే పనులన్నీ ఈ రింగ్ చేస్తుంది. వేలుకి ధరిస్తే చాలు.. మీ హార్ట్‌ బీట్‌ రేటుతో పాటు ఆక్సిజన్‌ స్థాయిలను ట్రాక్‌ చేస్తుంది. స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను మీ ఫోన్‌లో చూసుకోవచ్చు.

ఇక స్మార్ట్ రింగ్ మీ రోజువారీ కార్యకలాపాలను ట్రాక్‌ చేస్తుంది. ఈ రింగ్‌ 20కిపైగా ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మీరు రోజు ఎన్ని అడుగులు నడిచారన్న విషయాన్ని కూడా లెక్కిస్తుంది. ఇక ఈ రింగ్‌ బరువు 4.7 గ్రాములుగా ఉంటుంది. బోట్‌ కంపెనీ స్మార్ట్‌ రింగ్‌పై ఏడాది వారంటీని అందిస్తుంది. జులై 20 నుంచి అమ్మకాలు ప్రారంభమైన ఈ రింగ్‌ అమెజాన్‌తో పాటు, బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఈ రింగ్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేశారు. ఇక ఈ రింగ్‌ను 6 సైజ్‌లతో పాటు, 3 కలర్స్‌లో తీసుకొచ్చారు. బ్లాక్‌, గోల్డ్‌, సిల్వర్‌ కలర్స్‌లో ఈ రింగ్‌ను లాంచ్‌ చేశారు. అంతేకాదు ఈ రింగ్‌ను స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఫోన్‌ కెమెరాను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories