BSNL PLAN: మీకు తక్కువ ధరకే డేటా ప్లాన్ కావాలా? అయితే BSNL కొత్త ప్లాన్‌ని పొందండి

BSNL PLAN: మీకు తక్కువ ధరకే డేటా ప్లాన్ కావాలా? అయితే BSNL కొత్త ప్లాన్‌ని పొందండి
x
Highlights

BSNL PLAN: తక్కువ ధరకు మంచి డేటా ప్లాన్ కావాలనుకునేవారికి గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం తెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు ఒక రూపాయికే ఒక జీబీ డేటా పొందవచ్చు.

BSNL PLAN: తక్కువ ధరకు మంచి డేటా ప్లాన్ కావాలనుకునేవారికి గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం తెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు ఒక రూపాయికే ఒక జీబీ డేటా పొందవచ్చు. ఆ వివరాలు చూద్దాం.

భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ(BSNL) వినియోగదారులకు సరికొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 4జీ డేటాను భారీగా తగ్గించినట్లు తన అదికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ ప్రకారం, ఈ కొత్త ప్లాన్ జూన్ 28 నుంచి జులై 1 వరకు ఉంటుంది. ఈ పరిమిత కాలంలో వినియోగదారులు కేవలం రూ.400లకు 400 జీబీ డేటాను కొనుగోలు చేయొచ్చు. అంటే ప్రతి జిబికి కేవలం ఒక రూపాయి మాత్రమే పడుతుంది. దీనికి సంబంధించిన ఆఫర్‌‌ని వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.

కొత్త వినయోగదారులకు ఆకట్టుకోవాలనే లక్ష్యంతో బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 13వేల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టి కొత్త టవర్స్‌ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు ఈ సంస్థ హైదరాబాద్‌లో 5జి ఫిక్స్‌డ్ వైర్‌‌లెస్ యాక్సెస్ సేవను కూడా ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగుళూరుతో పాటు పలు నగరాల్లో ఈ సేవలను విస్తరించాలని సంస్థ ప్లాన్ చేస్తుంది.

గత కొంతకాలంగా బిఎస్ఎన్ఎల్ ఎంతోమంది వినియోగదారులను కోల్పోయింది. అందుకే ఇప్పుడు మళ్లీ పుంజు కోవాలనే లక్ష్యంతో కొత్త ప్లాన్స్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చి, వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తుంది. దీనికోసం ఆయా ప్రాంతాల్లో గణనీయంగా కనెక్టివిటీని పెంచుకోవాలని చూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories