ChatGPT Crisis: చాట్‌జీపీటీకి బిగ్ షాక్.. మొదలైన యుద్ధం

ChatGPT Crisis
x

ChatGPT Crisis: చాట్‌జీపీటీకి బిగ్ షాక్.. మొదలైన యుద్ధం

Highlights

ChatGPT Crisis: అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందం వల్ల 25 లక్షల మంది యూజర్లు చాట్‌జీపీటీని వదిలేశారు. నైతిక విలువల కోసం ఆంథ్రోపిక్ 'క్లాడ్' వైపు మొగ్గు చూపుతున్న యూజర్లు.

ChatGPT Boycott: అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ (OpenAI) కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందం టెక్ ప్రపంచంలో పెను తుఫాను సృష్టించింది. నిన్నటి వరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అత్యంత ఇష్టమైన తోడుగా ఉన్న చాట్‌జీపీటీ (ChatGPT), నేడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది యూజర్లు ఈ యాప్‌ను వీడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సాంకేతికత మానవాళి పురోభివృద్ధికి ఉపయోగపడాలి కానీ, విధ్వంసానికి కాదనేది టెక్ నిపుణుల వాదన. అయితే, తన ఏఐ మోడళ్లను అమెరికా రక్షణ శాఖ (Pentagon) యొక్క రహస్య నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకునేలా ఓపెన్ ఏఐ ఒప్పందం చేసుకోవడం యూజర్లకు ఆగ్రహం తెప్పించింది. ఏఐ సాంకేతికతను మిలిటరీ అవసరాలకు, నిఘా పనులకు వాడటం నైతిక విలువలకే విరుద్ధమని భావిస్తూ సోషల్ మీడియాలో #QuitChatGPT అనే ఉద్యమం మొదలైంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, అమెరికాలో ఒక్క శనివారం రోజే అన్‌ఇన్‌స్టాల్‌లు 295 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ వివాదం వెనుక ఆసక్తికరమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. గతంలో అమెరికా రక్షణ శాఖ ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన క్లాడ్ మోడల్స్‌ను వాడేది. అయితే, ఎలాంటి నియంత్రణలు లేకుండా మిలిటరీ అవసరాలకు పూర్తి యాక్సెస్ ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరగా, ఆంథ్రోపిక్ అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించింది. నైతిక విలువలకు కట్టుబడి ఆంథ్రోపిక్ 'నో' చెబితే, లాభాపేక్షతో ఓపెన్ ఏఐ 'యస్' చెప్పడం యూజర్ల ఆగ్రహానికి ఆజ్యం పోసింది.

యూజర్ల నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకతను ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఊహించలేకపోయారు. స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందని ఆయన అంగీకరించారు. పెంటగాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేస్తామని, యూజర్ల నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటామని ప్రకటించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చాట్‌జీపీటీ నుంచి తప్పుకున్న లక్షలాది మంది యూజర్లు ఇప్పుడు ఆంథ్రోపిక్‌కు చెందిన 'క్లాడ్' (Claude) చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నందున క్లాడ్‌కు ఆదరణ ఒక్కసారిగా పెరిగింది. ఎంతలా అంటే, యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి క్లాడ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది.సాంకేతిక రంగంలో ఎంతటి దిగ్గజ సంస్థ అయినా, వినియోగదారుల నమ్మకాన్ని, నైతిక విలువలను విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ బాయ్ కాట్ ఉద్యమం నిరూపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories