Ghibli: చాట్‌జీపీటీకి జీబ్లీ అదిరే గిఫ్ట్.. గంటలో ఎన్ని లక్షల యూజర్లను తెచ్చిపెట్టిందో తెలుసా?

Ghibli: చాట్‌జీపీటీకి జీబ్లీ అదిరే గిఫ్ట్.. గంటలో ఎన్ని లక్షల యూజర్లను తెచ్చిపెట్టిందో తెలుసా?
x
Highlights

Ghibli: ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తెరిచినా ఫీడ్ మొత్తం జీబ్లీ ఫొటోలతోనే నిండిపోతోంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో ఈ జీబ్లీ స్టూడియోను...

Ghibli: ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తెరిచినా ఫీడ్ మొత్తం జీబ్లీ ఫొటోలతోనే నిండిపోతోంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో ఈ జీబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ సదుపాయాన్ని నెటిజన్లు తెగ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేవలం ఒక గంటలో తమ మాధ్యమానికి మిలియన్ యూజర్లు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్ మన్ తెలిపారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

26 నెలల క్రితం చాట్ జీపీటీ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చిందని ఆల్ట్ మన్ తెలిపారు. ఐదు రోజుల్లోనే ఒక మిలియన్ మంది యూజర్లు చేరినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే తాజాగా జీబ్లీ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక గంట వ్యవధిలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చాట్ జీపీటీకి యాడ్ అయినట్లు వెల్లడించారు. ఇక ఇటీవల ప్రధాని మోదీకి చెందిన చిత్రాలను కూడా జీబ్లీ ఫీచర్ తో క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆల్టమన్ రియాక్ట్ అయ్యారు. మై గో ఇండియా అకౌంట్లో షేర్ చేసిన ఫొటోలను ఆయన రీపోస్ట్ చేసి దానికి భారత జెండా ఎమోజీని జత చేశారు.

కాగా ఈ జీబ్లీ ఇమేజ్ జనరేటర్ కు యూజర్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఇటీవల ఆల్టమాన్ స్పందించిన విషయం తెలిసిందే. జీబ్లీ వినియోగం విషయంలో యూజర్లు కాస్త కూల్ గా ఉంటే బాగుంటుందని..మా సిబ్బందికి నిద్ర లేకుండా చేస్తోందని ఆయన చమత్కరించారు. అంతేకాదు ఈ ఫీచర్ ను అత్యధికంగా వినియోగించడం వల్ల తమ జీపీయూ వ్యవస్థపై అధిక భారం పడుతుందని అందుకే దీనికి లిమిట్ పెడుతున్నామని ఆల్ట్ మన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్రీ యూజర్లు రోజుకు మూడు మాత్రమే జీబ్లీ ఫొటోలు జనరేట్ చేసుకునేలా లిమిట్ విధించారు. అయితే ప్రీమియం యూజర్లకు ఎలాంటి లిమిట్ లేదు. మరోవైపు గ్రోక్ లో కూడా ఈ ఫొటోల జనరేషన్ ఆప్షన్ను యూజర్లు విరివిగా ఉపయోగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories