FICCI-EY Report: టీవీ వద్దు.. డిజిటల్ ముద్దు.. ఫిక్కీ- ఈవై నివేదికలో కీలక విషయాలు!

FICCI-EY Report: టీవీ వద్దు.. డిజిటల్ ముద్దు.. ఫిక్కీ- ఈవై నివేదికలో కీలక విషయాలు!
x
Highlights

FICCI-EY Report: గత ఏడాది దేశంలో టెలివిజన్ మాధ్యమాన్ని డిజిటల్ మాధ్యమం వెనక్కు నెట్టింది. దీంతో మాధ్యమాలు వినోదరంగంలో అతిపెద్ద విభాగంగా అవతరించిందని ...

FICCI-EY Report: గత ఏడాది దేశంలో టెలివిజన్ మాధ్యమాన్ని డిజిటల్ మాధ్యమం వెనక్కు నెట్టింది. దీంతో మాధ్యమాలు వినోదరంగంలో అతిపెద్ద విభాగంగా అవతరించిందని ఫిక్కీ ఈవై లేటెస్ట్ రిపోర్టు తెలిపింది. మొత్తంలో ఆదాయంలోనూ ఈ విభాగం వాటా 32 శాతానికి చేరినట్లు తెలిపింది. 2026లో ఆదాయం పరంగా రూ. 1లక్ష కోట్ల మైలురాయిని అందుకున్న తొలి ఎం అండ్ ఈ విభాగంగా డిజిటల్ మాధ్యమం నిలిచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. భారత ఎం అండ్ ఈ రంగ పరిణామం రాబోయే మూడేళ్లలో 7శాతం చొప్పున పెరిగి రూ. 3లక్షల కోట్లను చేరొచ్చని రిపోర్టు అంచనా వేసింది.

2024లో భారత ఎం అండ్ ఈ రంగం విలువ రూ. 2.5లక్షల కోట్లకు చేరింది. దేశ జీడీపీకి 0.73శాతం వాటాను అందించింది. 2025లో భారత ఎం అండ్ ఈ రంగం విలువ 7.2శాతం పెరిగి రూ. 2.7లక్షల కోట్లకు, 2027 నాటికి 8శాతం వార్షి వృద్ధి రేటుతో రూ. 3.1 లక్షల కోట్లకు చేరే ఛాన్స్ ఉంది. వినూత్న వ్యాపార విధానాలు, భాగస్వామ్య ఒప్పందాలు విలీనాలు వంటివి ఈ రంగ వ్రుద్ధికి ప్రధాన చోదకాలుగా పనిచేస్తాయని రిపోర్టు వెల్లడించింది.

2023తో పోల్చితే 2024లో భారత ఎం అండ్ ఈ రంగ ఆదాయం రూ. 8,100 కోట్ల మేర పెరిగింది. దీంతో 3.3శాతం వ్రుద్ధిని నమోదు చేసింది. అయితే 2023లోని 8.3శాతంతో పోలిస్తే వృద్ధి రేటు తగ్గడానికి చందా ఆదాయాలు పడిపోవడం, భారత్ కు విదేశాల నుంచి యానిమేషన్, వీఎఫ్ఎక్స్ ఆర్డర్లు తగ్గడం కారణం అయ్యాయి.

భారత ఎండ్ అండ్ ఈ రంగ ప్రకటనల ఆదాయాలు ఆకర్షణీయంగా 8.1శాతం పెరిగాయి. ఇ కామర్స్ వెబ్ సైట్లు సహా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పై ప్రకటనలు పెరగడం ఇందులో కీలక పాత్ర పోషించింది. డిజిటల్ అవుట్ ఆఫ్ హోం మీడియాలో ప్రకటనలకు డిమాండ్ పెరగడం, పత్రిక, రేడియో రిటైల్ ప్రకటనల ఆదాయాలు పుంజుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories