Smartphone Tips: స్మార్ట్‌ఫోన్‌ను దగ్గర నుంచి చూస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్‌ను దగ్గర నుంచి చూస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా..
x
Highlights

మొబైల్ స్క్రీన్‌ను కంటికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. స్కూలుకు వెళ్లే చిన్నారి నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారు. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు స్మార్ట్‌ఫోన్‌ వల్ల లాభాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత వరకు నిజం ఉందో, నష్టాలు కూడా అంతే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రీల్స్‌ పేరుతోనో, గేమ్స్‌ పేరుతోనో ఫోన్‌ను గంటలతరబడి ఉపయోగిస్తే ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ను ముఖానికి దగ్గరగా పెట్టుకొని చూస్తే చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. మొబైల్ స్క్రీన్‌ను కంటికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా దీనివల్ల కంటిలోని రెటినాపై ప్రావం పడుతుందని చెబుతున్నారు.

రెటినీ దెబ్బతినడంతో కంటి చూపు మందగింగే ప్రమాదం ఉందని అంటున్నారు. కళ్లు అస్పష్టంగా కనిపించడం, మబ్బు మబ్బుగా ఉండడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. రాత్రుళ్లు లైట్స్‌ ఆఫ్‌ చేసిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే వారిలో ఈ ప్రమాదం మరిత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుంఆ ఈ బ్లూ లైట్ కారణంగా తీవ్రమైన తలనొప్పి, కళ్ళలో నుంచి నీరు కారడం, దురద వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి..

వీలైనంత వరకు స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువగా వినియోగించడం సూచించదగ్గ అంశం. అనివార్యమైతే మాత్రం కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ముఖానికి దూరంగా పెట్టుకొని ఉపయోగించాలి. అదే పనిగా స్మార్ట్‌ ఫోన్‌ను లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూసే వారు కాసేపు దూరంగా ఉన్న వస్తువులను గమనించాలి. అప్పుడప్పుడు కంటి రెప్పలు కొడుతుంటాడు. దీనివల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ కచ్చితంగా కంటికి 8 అంగుళాల దూరంలో ఉండాలని సూచిస్తున్నారు. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారైనా కళ్లకు కాసేపు విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడప్పుడు చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories