Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఈ రాత్రి నుండే ప్రారంభం.. 85 శాతం డిస్కౌంట్..!

Flipkart GOAT Sale
x

Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఈ రాత్రి నుండే ప్రారంభం.. 85 శాతం డిస్కౌంట్..!

Highlights

Flipkart GOAT Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు రాత్రి 12 గంటలకు పెద్ద సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ పేరు ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్. ఈ సేల్ బ్యానర్ అధికారిక ప్లాట్‌ఫామ్‌లో జాబితా చేశారు. సేల్ జూలై 12 నుండి ప్రారంభమై జూలై 17 వరకు కొనసాగుతుంది.

Flipkart GOAT Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు రాత్రి 12 గంటలకు పెద్ద సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ పేరు ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్. ఈ సేల్ బ్యానర్ అధికారిక ప్లాట్‌ఫామ్‌లో జాబితా చేశారు. సేల్ జూలై 12 నుండి ప్రారంభమై జూలై 17 వరకు కొనసాగుతుంది. గృహోపకరణ వస్తువులపై 85శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ఈ రాత్రి నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, పవర్ బ్యాంకులు, ప్రింటర్లు మొదలైన వాటిని కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ, వివిధ వర్గాల ఉత్పత్తులపై వేర్వేరు డిస్కౌంట్లు అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సమయంలో మీరు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందచ్చు. ఇక్కడ మీరు హెచ్‌డీఎఫ్‌సీ, ఐడిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించడంపై 10శాతం వరకు తగ్గింపు పొందచ్చు. ఆ తర్వాత ఆ ఉత్పత్తి ధర మరింత తగ్గుతుంది.

ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ టీజర్ ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌ను ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేయవచ్చని చూపిస్తుంది. ఐఫోన్ 16 ను రూ. 60 వేలకు కొనుగోలు చేయచ్చు, ఐఫోన్ 16 గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 79,990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది కాకుండా, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డీల్స్ అందుబాటులో ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేసిన వివరాలు గృహోపకరణ వస్తువులపై 85శాతం వరకు తగ్గింపు లభిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ కేటగిరీ కింద, మీరు గృహోపకరణాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు మొదలైన వాటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, వర్షాకాలంలో మీరు గొడుగును కూడా కొనుగోలు చేయచ్చు.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాల సమయంలో చాలా మంది సైబర్ స్కామర్లు కూడా చురుకుగా ఉంటారు.

అటువంటి పరిస్థితిలో వారు నకిలీ మేసెజెలు, ఇమెయిల్‌లు మొదలైన వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు లేదా సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయచ్చు. చాలా సార్లు ఈ సందేశాలు రూ.1కి స్మార్ట్‌ఫోన్‌లు లేదా రూ.1కి టీడబ్లూఎస్ లాంటివి ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తాయి, తరువాత మోసానికి పాల్పడతాయి. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ఈ రాత్రి నుండి ప్రారంభమవుతుంది, ఫోన్‌ల నుండి గృహోపకరణాల వరకు, మీరు 85శాతం వరకు తగ్గింపు పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories