Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. చౌకగా మారిన బ్రాండెడ్ ఫోన్లు..!

Flipkart New Sale buy Samsung Poco Nothing Phone at Cheapest Price
x

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. చౌకగా మారిన బ్రాండెడ్ ఫోన్లు..!

Highlights

Flipkart Sale: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఉగాది వేళ ఆఫర్లకు తెరలేపింది. కంపెనీ సరికొత్త సేల్ ప్రకటించింది.

Flipkart Sale: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఉగాది వేళ ఆఫర్లకు తెరలేపింది. కంపెనీ సరికొత్త సేల్ ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్లను చాలా చౌకగా కొనుగోలు చేయచ్చు. సామ్‌సంగ్, పోకో, నథింగ్, గూగుల్ పిక్సెల్ వంటి బ్రాండ్ ధరలు భారీగా తగ్గాయి. అంతేకాకుండా సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుదారులపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24+ 5G

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 99,999కి అందుబాటులో ఉంది. దీనిపై కంపెనీ 43 శాతం తగ్గింపును అందిస్తోంది. ఆ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 56,999కి కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూడచ్చు. బ్యాటరీ గురించి చెప్పాలంటే, ఈ స్మార్ట్‌ఫోన్ 4900mAh బ్యాటరీతో వస్తుంది.

Google Pixel 8a

జాబితాలోని తదుపరి ఫోన్ Google Pixel 8a. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 52,999కి అందుబాటులో ఉంది. ఇందులో 28 శాతం తగ్గింపు లభిస్తుంది. తగ్గింపు తర్వాత, మీరు స్మార్ట్‌ఫోన్‌ను రూ. 37,999కి కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 64MP డ్యూయల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనిపిస్తుంది.

Nothing Phone (2a) 5G

నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25,999గా ఉంది . ఈ స్మార్ట్‌ఫోన్‌పై 30 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 17,999కి కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్, 50MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను చూడచ్చు.

Poco C75 5G

పోకో C75 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,999కి జాబితా చేసింది. దీనిపై 27 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5160mAh బ్యాటరీతో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories