ఎట్టకేలకు గూగుల్ పిక్సెల్ 9ఎ లాంచ్ డేట్ ఫైనల్.. ధర ఎంతంటే?

Google new mid-range smartphone Pixel 9a coming to the global market soon
x

ఎట్టకేలకు గూగుల్ పిక్సెల్ 9ఎ లాంచ్ డేట్ ఫైనల్.. ధర ఎంతంటే?

Highlights

Google Pixel 9a Launch Date: గూగుల్ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Pixel 9a త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి రాబోతుంది. ఇటీవల అమెరికన్ మార్కెట్లో మొబైల్...

Google Pixel 9a Launch Date: గూగుల్ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Pixel 9a త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి రాబోతుంది. ఇటీవల అమెరికన్ మార్కెట్లో మొబైల్ ధర కూడా వెల్లడైంది. ఇప్పుడు ఈ మొబైల్ ధర, లాంచ్ తేదీకి సంబంధించిన సమాచారం యూరప్‌లో లీక్ అయింది. Pixel 9a గత సంవత్సరం విడుదల చేసిన Pixel 8a మొబైల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా తీసుకురాబోతుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పిక్సెల్ 9a ధర, లాంచింగ్ తేదీ

యూరప్‌లో పిక్సెల్ 9ఎ ప్రీ-బుకింగ్ మార్చి 19 నుండి ప్రారంభమవుతుంది. మార్చి 26 నుండి సేల్‌కి అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అదే లాంచ్ టైమ్‌లైన్ అమెరికన్ మార్కెట్‌లో కూడా ఉంటుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. మొబైల్ 128GB వేరియంట్ ధర 499 పౌండ్లు అంటే సుమారు రూ. 54,343 ఉంటుంది. అలానే ఫోన్ 256GB వేరియంట్ ధరను పెంచే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్ 599 పౌండ్లు లేదా రూ. 65,233కి అందుబాటులో ఉంటుంది.

పిక్సెల్ 9a స్పెసిఫికేషన్స్

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9a రెండు వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లన బట్టి వేర్వేరు కలర్లలో లాంచ్ అవుతుంది. ఫోన్ 128GB వేరియంట్ అబ్సిడియన్, ఐరిస్, పియోనీ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. 256GB వేరియంట్ అబ్సిడియన్, ఐరిస్ కలర్స్ మాత్రమే ఉంటుంది.

పిక్సెల్ 9a ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. కంపెనీ ఈ ఫోన్‌ను Google Tensor G4 చిప్‌సెట్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. కెమెరా ఫీచర్లలో 48MP ప్రైమరీ కెమెరా ఉంది. అయితే కంపెనీ పిక్సెల్ 8aలో 64MP కెమెరాను అందించింది. నాన్-స్టాప్ వినోదం కోసం ఈ గూగుల్ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా Google Pixel 9aతో మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, 100GB గూగుల్ ఒన్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories