Honor X9c 5G Launched in India: మూడురోజులు బ్యాటరీ లైఫ్, 2 మీటర్ల నుంచి పడినా ఏమీ కాదు!

Honor X9c 5G Launched in India: మూడురోజులు బ్యాటరీ లైఫ్, 2 మీటర్ల నుంచి పడినా ఏమీ కాదు!
x

Honor X9c 5G Launched in India: మూడురోజులు బ్యాటరీ లైఫ్, 2 మీటర్ల నుంచి పడినా ఏమీ కాదు!

Highlights

Honor X9c 5G India launch, Honor X9c features, Honor X9c price Amazon, Honor phone with 3-day battery, 108MP camera phone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హానర్‌ తన తాజా స్మార్ట్‌ఫోన్‌ Honor X9c 5Gను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో గ్లోబల్‌గా రిలీజ్ అయిన ఈ ఫోన్‌ ఇప్పుడు ఇండియాలో ప్రవేశించనుండగా, జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్లో ఇది అందుబాటులోకి రానుంది.

హానర్ X9c 5G ఫీచర్లు:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 ఇంచుల 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది యాంటీ-డ్రాప్ టెక్నాలజీతో వస్తోంది. అంటే 2 మీటర్ల ఎత్తు నుంచి నేలపై పడినా డిస్‌ప్లేకు ఏమీ కాకుండా తయారు చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో వీక్షణ అనుభూతి మెరుగ్గా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, మ్యాజిక్ OS 9.0 (Android 15 ఆధారితం), అలాగే AI మోషన్ సెన్సింగ్, డీప్‌ఫేక్ డిటెక్షన్, మాజిక్ పోర్టల్ 2.0 వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా మరియు బ్యాటరీ:

ఫోన్ వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరాను, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది 6600mAh భారీ బ్యాటరీతో వస్తోంది. కంపెనీ ప్రకారం, ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేసినట్లయితే మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందట. దీనికి 66W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌కు IP65 రేటింగ్ ఉంది, అంటే ఇది నీటి తడులకు కొంతవరకూ రక్షణ కలిగిస్తుంది.

ధర మరియు లభ్యత:

Honor X9c 5G ఒకే వేరియంట్‌లో వస్తోంది – 8GB RAM + 256GB స్టోరేజ్. దీని అసలైన ధర ₹21,999 కాగా, లాంచ్ ఆఫర్‌గా పరిమిత కాలానికి ₹19,999కే విక్రయించనున్నారు. జేడ్ సియాన్, టైటానియం బ్లాక్ అనే రెండు రంగులలో ఇది లభ్యం కానుంది. జూలై 12 నుంచి అమెజాన్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories