iOS 26 Beta 5: “లిక్విడ్ గ్లాస్” డిజైన్‌తో ఆపిల్ తాజా అప్‌డేట్

iOS 26 Beta 5: “లిక్విడ్ గ్లాస్” డిజైన్‌తో ఆపిల్ తాజా అప్‌డేట్
x

iOS 26 Beta 5: “లిక్విడ్ గ్లాస్” డిజైన్‌తో ఆపిల్ తాజా అప్‌డేట్

Highlights

ఆపిల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26ను WWDC 2025 ఈవెంట్‌లో అధికారికంగా పరిచయం చేసింది. iOS 7 తర్వాత వచ్చిన భారీ డిజైన్ మార్పుతో ఇది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆపిల్ iOS 26 బీటా 5 వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది ప్రస్తుతానికి డెవలపర్లు మరియు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రధాన హైలైట్: లిక్విడ్ గ్లాస్ డిజైన్

iOS 26 లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది “లిక్విడ్ గ్లాస్” డిజైన్. ఇది ట్రాన్స్‌లూసెంట్ ఎలిమెంట్స్‌తో కూడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. గ్లాస్‌లా మెరిసే ఐకాన్‌లు, విడ్జెట్‌లు, మెనూలు, నావిగేషన్ బార్‌లు కలిగిన ఈ డిజైన్ యూజర్‌కు మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తుంది. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ మరియు సిస్టమ్ నావిగేషన్ మొత్తం కొత్తదనం వెదజల్లుతాయి.

iOS 26 బీటా 5లో కొత్త ఫీచర్లు:

డైనమిక్ ఐలాండ్‌లో బ్యాటరీ అలర్ట్ – బ్యాటరీ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు స్పష్టమైన హెచ్చరిక.

లాక్ స్క్రీన్‌లో కొత్త పాస్‌కోడ్ యానిమేషన్ – పాస్‌వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఆకర్షణీయమైన విజువల్స్.

కొత్త స్ప్లాష్ స్క్రీన్‌లు – ఆపిల్ యాప్‌లకు డిఫరెంట్ లుక్.

విస్తృత హోమ్ స్క్రీన్ డాక్ – మరింత స్పేస్‌తో క్లీన్ లుక్.

అప్‌డేటెడ్ కంట్రోల్ సెంటర్ యానిమేషన్ – మరింత స్మూత్ స్క్రోలింగ్ ఎఫెక్ట్స్.

Wi-Fi టోగుల్ ఫీచర్ – ఎక్కువసేపు నొక్కితే ఆ నెట్‌వర్క్ ప్రైవేట్ లేదా పబ్లిక్ అని చూపిస్తుంది.

పేజీలకు బౌన్స్ ఎఫెక్ట్ – స్క్రోలింగ్‌కు కొత్త లుక్.

ఈ అప్‌డేట్‌కి బిల్డ్ నంబర్ 23A5308g.

ఏ ఏ ఫోన్లకు iOS 26 అందుబాటులో ఉంటుంది?

iOS 26 అన్ని ఐఫోన్ మోడల్స్‌కు అందుబాటులో ఉండదు. కింది మోడల్స్‌కి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది:

iPhone 11 సిరీస్ – 11, 11 Pro, 11 Pro Max

iPhone 12 సిరీస్ – 12, 12 Mini, 12 Pro, 12 Pro Max

iPhone 13 సిరీస్ – 13, 13 Mini, 13 Pro, 13 Pro Max

iPhone 14 సిరీస్ – 14, 14 Plus, 14 Pro, 14 Pro Max

iPhone 15 సిరీస్ – 15, 15 Plus, 15 Pro, 15 Pro Max

iPhone 16 సిరీస్ – 16, 16 Plus, 16 Pro, 16 Pro Max, 16e

iPhone SE – 2nd Gen & later

iPhone 17 సిరీస్ – సెప్టెంబర్ 2025లో విడుదల కానుంది

ఈ అప్‌డేట్‌ ద్వారా ఆపిల్ యూజర్లకు మరింత మోడర్న్, ఇంటరాక్టివ్, విజువల్‌గా ఇంప్రెస్ చేసే యూజర్ ఇంటర్‌ఫేస్ లభించనుంది. iOS 26 అధికారికంగా సెప్టెంబర్‌లో iPhone 17 సిరీస్‌తో పాటు విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories